Bobbili Yuddham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bobbili Yuddham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2025, శనివారం

Bobbili Yuddham : Andala Raanive Song Lyrics (అందాల రాణివే..)

చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)

సాహిత్యం: శ్రీశ్రీ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి  రాజేశ్వర రావు



పల్లవి:

అందాల రాణివే.. నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా..ఆ..
వీరాధి వీరులే.. రణరంగ ధీరులే
ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..
వీరాధి వీరులే..

చరణం 1:

పరీక్ష చాలులే.. ఉపేక్ష యేలనే
సుఖాల తీరము.. ఇంకెంత దూరము..
ఓ..ఓ..ఓ..
పరీక్ష చాలులే.. ఉపేక్ష యేలనే
సుఖాల తీరము.. ఇంకెంత దూరము..
ఉపేక్ష కాదిది.. అపేక్ష ఉన్నది
నీరిక్ష చాల మంచిదీ..ఈ..
వీరాధి వీరులే.. రణరంగ ధీరులే..
ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..
వీరాధి వీరులే..

చరణం 2:

క్రీగంటితో నను దోచి.. నా గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా.. ఆడుతే చాలులే.. ఆడుతే చాలులే..
చాలులే.. చాలులే..
శ్రీవారి హృదయము.. నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము.. కాపాడు కవచము
అహహా..ఆ..ఆ..
శ్రీవారి హృదయము.. నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము.. కాపాడు కవచము
ప్రియురాలి రూపము.. రేగించే మోహము
నేనింక తాళజాలనే..ఏ..ఏ..హే..ఏ..
అందాల రాణివే.. నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా..ఆ..
అందాల రాణివే..

చరణం 3:

నీ వంటివారికి మేలా.. మేలెంచు పెద్దలు లేరా
వారిదే భారము.. యేల ఈ ఆగము
ఆగుము.. ఆగుము..
ఆగను.. ఆగను...
ఏకాంత సమయము.. ఆనంద నిలయము
నీవెన్ని అనినను.. నీ చేయి విడువను
ఓ..ఓ..ఓ..ఓ..
ఏకాంత సమయము.. ఆనంద నిలయము
నీవెన్ని అనినను.. నీ చేయి విడువను
జగానికందము వివాహాబంధము.. ఆనాడే తీరు వేడుకా..ఆ..
అందాల రాణివే.. నీవెంత జాణవే
ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..
అందాల రాణివే.. నీవెంత జాణవే
ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..
అందాల రాణివే..

Bobbili Yuddham : Ooyalalooginadoyi Song Lyrics (ఊయలలూగినదోయి మనసే)

చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: భానుమతి రామకృష్ణ

సంగీతం: సాలూరి  రాజేశ్వర రావు



పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన .. ఊయలలూగినదోయీ...

చరణం 1:

వెన్నెల పూవులు విరిసే వేళా
సన్నని గాలులు సాగే వేళా
వలపులు ఏవో పలికెను నాలో ... ఆ...
తెలుపగ రానిది ఈ హాయి...
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయీ...

చరణం 2:

కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
ప్రాయము నీవై.. పరువము నేనై ….
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి…
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయీ...

Bobbili Yuddham : Ninuchhera Manasayera Song Lyrics (నిను చేర మనసాయెరా... )

చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)

సాహిత్యం: శ్రీశ్రీ

గానం: పి. సుశీల

సంగీతం: సాలూరి  రాజేశ్వర రావు



పల్లవి:

నిను చేర మనసాయెరా...  నా స్వామి
చనువార దయసేయరా...
ఆ..ఆ..ఆ..
నిను చేర మనసాయెరా... నా స్వామి
చనువార దయసేయరా...
ఆ..ఆ..ఆ..
నిను చేర మనసాయెరా..

చరణం 1:

విడిదికి రమ్మని చాల వేడితిరా
విడిదికి రమ్మని చాల వేడితిరా
బిడియము నీకేలరా... దొరా
బిడియము నీకేలరా... దొరా.. ఆ..ఆ..ఆ..
నిను చేర మనసాయెరా... నా స్వామి

చరణం 2:

గా గరిగ సాగరిగ
సనిదమప నిదమపా
నిదమపదనిస మపమపదప
మనిద మపదనిని నిస
సరసుడవని నిన్నే పదిమంది పొగడా
సరసుడవని నిన్నే పదిమంది పొగడా
మరిమరి కోర్కెలు విరిసెను ప్రియుడా
మరిమరి కోర్కెలు విరిసెను ప్రియుడా
వయసు నీకొరకె పలవరించెరా
తనువు నిందలచి పులకరించెరా
మగువ కోర మొగమాట మేలరా
బిగువు మాని జవరాలి నేలరా
సొగసు చూచి ఎదురు కాచి నిలిచి
పగలు రేలు దిగులు చెందు చెలికి..
నిను చేర మనసాయెరా...  నా స్వామి
చనువార దయసేయరా...
ఆ..ఆ..ఆ..
నిను చేర మనసాయెరా... ఆ..ఆ..ఆ..

Bobbili Yuddham : Muthyala Chemmachekka Song Lyrics (ముత్యాల చెమ్మచెక్క )

చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి. సుశీల

సంగీతం: సాలూరి  రాజేశ్వర రావు


పల్లవి:

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ....
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

చరణం 1:

తళ తళ తళ తళ మెరిసే సొగసు...
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు...
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
పరువము వేసిన పందిరిలో...
బుజబుజ రేకులు పూయవలె....
పరువము వేసిన పందిరిలో...
బుజబుజ రేకులు పూయవలె....
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

చరణం 2:

ఒప్పులకుప్ప.. వయ్యారి భామా
సన్నబియ్యం..  ఛాయపప్పు
చిన్నమువ్వ..  సన్నగాజు
కొబ్బరికోరు..  బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్.. నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు.. నీ మొగుడెవడు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆ..ఆ..ఆ..ఆ... ఓ..ఓ..ఓ..ఓ...
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ...

Bobbili Yuddham : Muripinche Andale Song Lyrics (మురిపించే అందాలే... )

చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)

సాహిత్యం: శ్రీశ్రీ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి  రాజేశ్వర రావు



పల్లవి:

సొగసు కేల్జడదాన .. సోగకన్నులదాన
వజ్రాలవంటి పల్వరుసదాన...
బంగారు జిగిదాన.. సింగారములదాన
నయమైన వయ్యారి నడలదాన...
తోరంపు కటిదాన ... తొణకు సిగ్గులదాన
పిడికిటనడగు నెన్నడుముదాన...
ఆ....ఆ.....ఆ.....ఆ....ఆ....ఆ...
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..
నా దానవు నీవేలే... నీ వాడను నేనేలే...
ఆ....ఆ....ఆ...ఆ...
దరి చేర రావే... సఖి నా సఖీ...
ప్రేయసి సిగ్గేల...
మరపించే మురిపాలే... కరిగించే కెరటాలై..ఈ..
మరపించే మురిపాలే... కరిగించే కెరటాలై..ఈ..
నిదురించే భావాల... కదిలించే ఈ వేళ...
ఆ....ఆ....ఆ...ఆ...
అదే హాయి కాదా.. సఖా నా సఖా..
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..

చరణం 1:

చెలి తొలి చూపే మంత్రించెనే... ప్రియసఖు రూపే మదిలేలెనే...
చెలి తొలి చూపే మంత్రించెనే... ప్రియసఖు రూపే మదిలేలెనే...
ఇది ఎడబాటు కనలేని ప్రేమా... ఇల మనకింక సురలోక సీమ...
ఇది ఎడబాటు కనలేని ప్రేమా... ఇల మనకింక సురలోక సీమ...
ఇదేహాయి కాదా... సఖా.. నా సఖా ...ఆ...ఆ...
మురిపించె అందాలే... అవి నన్నే చెందాలే

చరణం 2:

అనురాగాల రాగాలలో... నయగారాల గారాలలో
అనురాగాల రాగాలలో... నయగారాల గారాలలో
మధుమాధుర్యమే నిండిపొయే... హృదయానందమే పొంగిపొయే
మధుమాధుర్యమే నిండిపొయే... హృదయానందమే పొంగిపొయే
దరి చేర రావే ... సఖి..  నా సఖీ...
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే...

26, జనవరి 2022, బుధవారం

Bobbili Yuddham : Srikara Karunala Vala Venugopala Song Lyrics (శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా.)

చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)

సాహిత్యం: సముద్రాల జూనియర్

గానం: భానుమతి రామకృష్ణ

సంగీతం: సాలూరి  రాజేశ్వర రావు



పల్లవి: శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా.. ఆ..ఆ..ఆ శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా.. సిరులు యశము శోభిల దీవించు మమ్ములా.. ఆ..ఆ శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా చరణం 1: కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం కన్న తండ్రి కలలు నిండి.. మా కన్న తండ్రీ కలలు నిండి కలకాలం వర్ధిల్లగా..ఆ..ఆ..ఆ..ఆ శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా సిరులు యశము శోభిల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా చరణం 2: పెరిగి మా బాబు వీరుడై... ధరణీ సుఖాల ఏలగా పెరిగి మా బాబు వీరుడై... ధరణీ సుఖాల ఏలగా తెలుగు కీర్తి తేజరిల్లి... తెలుగు కీర్తి తేజరిల్లి.. దిశలా విరాజిల్లగా..ఆ..ఆ..ఆ.. శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా.. సిరులు యశము శోభిల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..