Chakram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chakram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జూన్ 2021, శనివారం

Chakram : Jagamantha Kutumbam song lyrics (జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది)

 

చిత్రం: చక్రం

సంగీతం: చక్రి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రీ


జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిసినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హ్రుదయమే నా లోగిలి నా హ్రుదయమే నా పాటకి తల్లి నా హ్రుదయమే నాకు ఆలి నా హ్రుదయములో ఇది సినీవాలి జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

Chakram : Oke Oka Mata song Lyrics (ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా)

 చిత్రం: చక్రం

సంగీతం: చక్రి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: చక్రి



ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

నా పేరు నీ ప్రేమనీ

నా దారి నీ వలపనీ

నా చూపు నీ నవ్వనీ

నా ఓపిరే నువ్వనీ

నీకు చెప్పాలని


నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు

నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు

నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని

నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ

నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ

తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ

నీకు చెప్పాలని


నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం

నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం

నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ

నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలిపోదనీ

ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ

ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ

నీకు చెప్పాలనీ