Chanakya Chandragupta లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chanakya Chandragupta లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2022, మంగళవారం

Chanakya Chandragupta : Chirunavvula Tholakarilo Song Lyrics (చిరునవ్వుల తొలకరిలో)

చిత్రం: చాణక్య చంద్రగుప్త (1977)

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు



హ.హ.హ.హ.హ చిరునవ్వుల తొలకరిలో. సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో. సిరిమల్లెల చినుకులలో పలికెనులే. హృదయాలే. పలికెనులే. హృదయాలే. తొలివలుపుల కలయికలో చిరునవ్వుల తొలకరిలో. సిరిమల్లెల చినుకులలో వసంతాలు దోసిట దూసి. విసిరేను నీ ముంగిలిలో తారలనే దివ్వెలు చేసి. వెలిగింతు నీ కన్నులలో నీవే నా జీవనాడిగా... ఆ.ఆ నీవే నా జీవనాడిగా. ఎగిసేను గగనాల అంచులలో. ఓ.ఓ. విరియునులే ఆ గగనాలే. నీ వెన్నెల కౌగిలిలో. ఓ. చిరునవ్వుల తొలకరిలో. సిరిమల్లెల చినుకులలో.ఓ ఉరికే సెలయేరులన్నీ... ఓదిగిపోవు నీ నడకలలో ఉరిమే మేఘా.ఆ.ఆ లన్నీ. ఉలికి పడును నీ పలుకులలో నీవే నా పుణ్యమూర్తిగా.ఆ.ఆ నీవే నా పుణ్యమూర్తిగా.ఆ. ధ్యానించు నా మధుర భావనలో. ఓ.ఓ. మెరియునులే ఆ భావనలే. ఇరు మేనుల అల్లికలో.ఓ.ఓ చిరునవ్వుల తొలకరిలో. సిరిమల్లెల చినుకులలో.ఓ ఆ.ఆ. పలికెనులే. హృదయాలే. తొలివలుపుల కలయికలో. ఓ.ఓ.ఓ. చిరునవ్వుల తొలకరిలో. సిరిమల్లెల చినుకులలో. చిరునవ్వుల తొలకరిలో. సిరిమల్లెల చినుకులలో.ఓ