Cheli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Cheli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, మే 2022, మంగళవారం

Cheli : Hey Vennela Sona Song Lyrics ( హే వెన్నెలసోనా)

చిత్రం: చెలి (2001)

రచన: భువన చంద్ర

గానం: హరీష్ రాఘవేంద్ర, టిమ్మీ

సంగీతం: హర్రీస్ జయరాజ్



హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ hypertension తలకెక్కి ఆడేసేయ్ నా హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ hypertension తలకెక్కి ఆడేసేయ్ నా స్త్రీలంటే నీకొక allergy కాదా ఈమెను చూస్తేనే నీకెంతో energy కాదా నన్ను ఏదో చేసేసిందంట come on baby don't do this baby లవ్లీ బాణం కొట్టేసిందంట లవ్లీగా నన్ను పట్టేసిందంట don't you ever do this don't you ever do this don't you ever do this నిదరే నే మరిచా వ్యధతో నిన్నే తలిచా చవితి వెన్నెల్తో కబురెట్టి రమ్మంటే తగదు అన్నావు ఇది న్యాయమా ఇది రెచ్చిపోయే అరే నేస్తం ఎదలోన సాగె ఒక యుద్ధం అరె thaar ఎడారిలో సన్ను మాదిరి మండుతున్నదే హృదయం బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైన ఇల్ల ఓ ఇంద్రనీలమా ఇంత జాలమా అలక మానుమా mumbai బొమ్మా హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ hypertension తలకెక్కి ఆడేసేయ్ నా never do this to me don't ever do this to me baby నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా నువ్వంటే నాకు ప్రాణం నేనుందే నీకోసం ఎదట నిల్చున్న ఏమేమి చేస్తున్న నా అంతరంగాన నీవే కదా loveతో పిచ్చి ఎక్కి మనసంతా అతడే వాలిపోయే నీ చెంత నను కొద్దికొద్దిగా గుట్టుగుట్టుగా చంపుతుంటే ఇంకెట్టా తొలివలపు తాకి నా దేహం అంతా మెరిసిపోయెనే పిల్లా నా శ్వాస నీవుగా నీవే నేనుగా తోడులేనిదే బ్రతికేదెల్లా హే సోనా వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ hypertension తలకెక్కి ఆడేసేయ్ నా స్త్రీలంటే నీకొక allergy కాదా ఈమెను చూస్తేనే నీకెంతో energy కాదా నన్ను ఏదో చేసేసిందంట come on baby don't do this baby లవ్లీ బాణం కొట్టేసిందంట లవ్లీగా నన్ను పట్టేసిందంట

7, మే 2022, శనివారం

Cheli : Varshinche Meghamla Nenunna Song Lyrics

చిత్రం: చెలి (2001)

రచన: భువన చంద్ర

గానం: హరీష్ రాఘవేంద్ర, టిమ్మీ,వాసు

సంగీతం: హర్రీస్ జయరాజ్


వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా  వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా  కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట  నా గతమంతా నే మరిచానే నే మరిచానే  నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా ప్రేమా గీమా వలదే  వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా  కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట  నా గతమంతా నే మరిచానే నే మరిచానే  నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా ప్రేమా గీమా వలదే  నాటి వెన్నెల మళ్ళీ రానే రాదు మనసులో వ్యధ ఇంక అణగదు  వలపుదేవిని మరువగ తరమా ఆమని ఎరుగని శూన్యవనమిది  నీవే నేనని నువ్వు పలుకగ కోటి పువ్వులై విరిసెను మనసే  చెలి సొగసు నన్ను నిలువగనీదే వర్ణించమంటే భాషే లేదే  ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే మరచిపోవే మనసా  వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా  కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట నా గతమంతా నే మరిచానే నే మరిచానే  నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా ప్రేమా గీమా వలదే  చేరుకోమని చెలి పిలువగ ఆశతో మది ఒక కల గని  నూరుజన్మల వరమై నిలిచే ఓ చెలీ  ఒంటరిభ్రమ కల చెదిరిన ఉండు నా ప్రేమ అని తెలిసిన  సర్వనాడులు కృంగవా చెలియా  ఒక నిమిషమైన నిను తలవకనే బ్రతికేది లేదు అని తెలుపుటెలా  మది మరిచిపోని మధురోహలనే మరిచిపోవే మనసా

Cheli : Ningiki Jabili Andam Song Lyrics

చిత్రం: చెలి (2001)

రచన: భువన చంద్ర

గానం: హరీష్ రాఘవేంద్ర, టిమ్మీ

సంగీతం: హర్రీస్ జయరాజ్



Movie: Cheli Star Cast: R.Madhavan, Reema Sen, Abbas Singer: Harish Raghavendra, Timmy Music Director: Harris Jayaraj Director: Gautham Menon Lyricist: Bhuvana Chandra


నింగికి జాబిలీ అందం నేలకు తొలకరి అందం నీ కనుచూపులు సోకడమే ఆనందం. ఆనందం. ఆనందం బొమ్మాబొరుసుల చందం విడిపోనిది మన బంధం కమ్మని కలల గోపురమీ అనుబంధం. అనుబంధం. అనుబంధం ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా

వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిల్లి పోకే చెలియా నన్నొదిలి నవ్వులు రువ్వి పువ్వులు రువ్వి అడకే దీవాలి చెవిలో పాడకే కవ్వాలి మనసా మనసా నిన్నూ మదిలో దాచినదెవరు నా ఎదలోనే ఉంటూ నన్నే దోచినవారే వారెవరో వారెవరో వచ్చినదెందుకనో ఎదలోనే ఎదలోనే దాగినదెందుకనో ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా అరె తికమక పడుతున్నా

సొగసరిగువ్వా సొగసరిగువ్వా తడబాటెందులకే వలపుల దాహం తీర్చవటే మనసున మోహం కమ్ముకువస్తే మౌనం వీడవటే మదనుడి సాయం కోరవటే ఏమో ఏమో నన్ను ఏదో చేశావులే నేను నీకు చేసిందేదో నువ్వే నాకు చేశావే బొమ్మా నీవెవరో నీవెవరో వచ్చినదెందుకనో నా వెనకే పడ్డావు. నేనేలే నీకోసం వచ్చా మనసారా నా ఎదనే నీకోసం పరిచా ప్రియమారా ఏమైందో నాకే తెలియదులే నా మనసు నిన్నే వీడదులే అరె ఎందుకిలా ఎందుకిలా జరిగెనే ప్రాణసఖీ ఇది వలపుకథో వయసువ్యధో తెలుపవే చంద్రముఖీ కథ తెలుపవే చంద్రముఖీ. కథ తెలుపవే చంద్రముఖీ. కథ తెలుపవే చంద్రముఖీ. చంద్రముఖీ.చంద్రముఖీ.చంద్రముఖీ

29, జూన్ 2021, మంగళవారం

Cheli : Manohara Song Lyrics (మనోహర నా హృదయమునే)

చిత్రం: చెలి(2001 )

సంగీతం:హారిస్ జయరాజ్

సాహిత్యం: భువన చంద్ర

గానం: బొంబాయి జయశ్రీ



మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట

రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట

రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట

నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ

నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల


జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా

శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం

కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి

నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా

ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం

ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట

సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట ఓ ప్రేమా ప్రేమా…..


సందె వేళ స్నానం చేసి నన్ను చేరి

నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం

దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక

వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం

నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా

ఓసారి ప్రియమరా ఒడిచేర్చుకోవా నీ చెలిని

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట

రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట

నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ

నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల