Chinnari Sneham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chinnari Sneham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2021, బుధవారం

Chinnari Sneham : Chinnari Snehama Song Lyrics (చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో)

చిత్రం : చిన్నారి స్నేహం (1989)

సంగీతం: చక్రవర్తి


పల్లవి: చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదువుకో మరుజన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో చరణం 1: జీవితం నీకోసం స్వాగతం పలికింది ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది ఆకాశమంతా ఆలయం నీకోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది కాలం కరిగిపొతుంటే కలగా చెదిరి పోతుంది మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో చరణం 2: ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదువుకో మరుజన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో