ChiranJeevi Aaradhana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ChiranJeevi Aaradhana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జనవరి 2022, గురువారం

Aaradhana: Teeganai mallelu Song Lyrics (తీగనై మల్లెలు )

చిత్రం: ఆరాధన (1987)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా





తీగనై మల్లెలు పూచిన వేళ.... ఆగనా అల్లనా పూజకో మాల...... మనసు తెర తీసినా మోమాటమేనా ..... మమత కలబోసినా మాట కరువేనా...... తీగనై మల్లెలు పూచిన వేళ ..... ఆగనా అల్లనా పూజకో మాల...... తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా...... ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా...... ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా...... అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేనా...... ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా...... తెంచుంకుంటే తీరుతుందా పంచుకొంటే మరిచేదా...... కలలో మెదిలిందా ఇధి కధలో జరిగిందా...... మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా...... రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా...... మారమంటే మారుతుందా మాసిపోతుందా...... చేసుకున్నా పుణ్యముందా చేరుకొనే దారి ఉందా...... చేదుకొనే చేయి ఉందా చేయి చేయి కలిసేనా...... తీగనై మల్లెలు పూచిన వేళ ..... ఆగనా అల్లనా పూజకో మాల...... మనసు తెర తీసినా మోమాటమేనా..... మమత కలబోసినా మాట కరువేనా...... తీగనై మల్లెలు పూచిన వేళ..... ఆగనా అల్లనా పూజకో మాల......

30, మే 2021, ఆదివారం

Aaaradhana : Are Emaindhi Song Lyrics: (అరె ఏమైందీ అరె ఏమైందీ)

చిత్రం: ఆరాధన (1987)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా





అరె ఏమైందీ అరె ఏమైందీ అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ అది నీలో మమతను నిద్దురలేపింది ఆ ఆ ఆ అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ చరణం1: నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో ఓ ఓ ఓ లలలలలా లలల ల ల ల ల ల ల ల ల లలలలా చరణం2: బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు ఉ ఉ ఉ అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ అది నీలో మమతను నిద్దురలేపింది అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ.