చిత్రం: చిరునవ్వుతో (2000)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: మణి శర్మ
పల్లవి : సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా నవ్వే నీ కళ్లలో లేదా ఆ జాబిలి నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి... ఓ... హో... సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా నవ్వే నీ కళ్లలో లేదా ఆ జాబిలి నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి... ఓ... హో... చరణం : 1 నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ.. ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవచేయకూ... మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా నవ్వే నీ కళ్లలో లేదా ఆ జాబిలి నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి... ఓ... హో... చరణం : 2 ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ... నిద్రమానుకోగలమా.... ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా.... కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా నవ్వే నీ కళ్లలో లేదా ఆ జాబిలి నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి... ఓ... హో... సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా