Daagudu moothalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Daagudu moothalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మార్చి 2022, గురువారం

Daagudu moothalu : Adagaka icchina manase muddu song lyrics (అడగక ఇచ్చిన మనసే ముద్దు)

 

చిత్రం: దాగుడుమూతలు (1964) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: ఘంటసాల, సుశీల



పల్లవి: అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చరణం 1: నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చరణం 2: చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు చరణం 3: పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు