చిత్రం: దేవదాస్ (2018)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్, రమ్య బెహరా
సంగీతం: మణి శర్మ
ఏమో ఏమో ఏమోమెరుపుతీగ ఎదురై నవ్విందేమోఏమో ఏమో ఏమోవెలుగు వాగు నాలో పొంగిందేమోఉందో లేదో ఏమోకాలి కింద నేలే కరిగిందేమోమాయో మహిమో ఏమోనేల కాస్త నింగై మెరిసిందేమోఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదేఇలాంటిదేదొ ఉన్నదంటే విన్న మాట కాదే
రాదే రాదే రాదేనెమలి కన్ను కలలో రూపం నీదేరాదే రాదే రాదేఎడమ వైపు ఎదలో దీపం నీదేలేదే లేనే లేదేఇంత గొప్ప అందం ఇలలో లేదేఉండే ఉంటే ముందేచూసినట్టు ఎవరూ అననే లేదేపోల్చేదెలా ఇలా అని నీలాగ ఉంది నువ్వేనమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే
లాలీ లాలీ అంటూజోల పాట పాడే పవనం నువ్వేలేలే లేలే అంటూ మేలుకొలుపు పాడే కిరణం నువ్వేనాలో భావం నువ్వేరూపు కట్టి ఇల్లా ఎదురైయ్యావేనాలో జీవం నువ్వేఆశ పెట్టి ననిలా కవ్విస్తావేలోలోన దాచుకున్న నా అందాల ఊహ నువ్వేనా చెంత చేరి ఇంతలా దోబూచులాడినావే