Devadasu (2006) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devadasu (2006) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2024, బుధవారం

Devadasu : Adigi Adagaleka Song Lyrics (అడిగీ అడగలేక)

చిత్రం: దేవదాసు (2006)

సాహిత్యం: చంద్రబోస్

గానం: కార్తీక్, సుజాత మోహన్

సంగీతం: చక్రి



పల్లవి:

అ:అడిగీ అడగలేక ఒక మాటే అడగనా ఆ:తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా అ:ఆశగ అడగనా నీ అడుగునై అడగనా ఆ:మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా అ:యెన్ని జన్మలైన జంట వీడరాదనీ

అ:అడిగీ అడగలేక ఒక మాటే అడగనా ఆ:తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా

చరణం:1

అ:నీకన్న మెత్తనిది నీ మనసే నచ్చినదీ ఆ:నీకన్న వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ అ:పెదవి కన్న యెద తీయనిదీ ఆ:కనులకన్న కద అల్లనిదీ అ:నువ్వు కన్న సిగ్గే నాన్యమైనదీ జన్మ కన్న ప్రేమే నమ్మికైనదీ అ:యెన్ని జన్మలైన ప్రేమ మాయరాదనీ

అ:అడిగీ అడగలేక ఒక మాటే అడగనా ఆ:తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా

చరణం:2

ఆ:నీకన్న చల్లనిది నీ నీడే దొరికిందీ అ:నీకన్న నిజమైంది నీ తోడే నాకుంది ఆ:సొగసు కన్న వొడి వాడనిదీ అ:బిగుసుకున్న ముడి వీడనిదీ అ:ముల్లు లేని పువ్వే ప్రేమ అయినదీ పూలు లేని పూజే ప్రేమ అన్నదీ ఆ:యే జన్మలోన ప్రేమ పూజ మానరాదనీ అ:అడిగీ అడగలేక ఒక మాటే అడగనా ఆ:తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా అ:ఆశగ అడగనా నీ అడుగునై అడగనా ఆ:మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా అ:బాస చేసుకున్న మాట 

Devadasu (2006) : nuvvantene ishtam song lyrics (నువ్వంటేనే ఇష్టం)

చిత్రం: దేవదాసు (2006)

సాహిత్యం: చంద్రబోస్

గానం: చక్రి

సంగీతం: చక్రి


పల్లవి  :

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా... ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా... నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం

చరణం : 1

రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం నువ్వంటేనే హే నువ్వంటేనే నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా...

చరణం : 2

పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి నన్నంతం చెయ్యి వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా ఒక్కసారి నువు ప్రేమిస్తే చావులేక నే బ్రతికేస్తా ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను కాదంటే కష్టం నువ్వంటేనే హే నువ్వంటేనే నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా... ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా