Devara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2025, సోమవారం

Devara : Fear Song ( అగ్గంటుకుంది సంద్రం)

చిత్రం : దేవర (2024)

సంగీతం : అనిరుధ్ రవి చందర్

గీత రచయిత : రామజోగయ్య శాస్త్రి

నేపధ్య గానం : అనిరుధ్ రవిచందర్



అగ్గంటుకుంది సంద్రం
ఏహా
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
ఏహా
చల్లారె చెడు సాహసం

జగడపు దారిలో
ముందడుగైన సేనానీ
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే

కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ

జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ
విధికే ఎదురై వెళితే విలవిలా

అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా

దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే

కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ

Devara : Ayudha Pooja Song Lyrics (ఎర్రటి సంద్రం ఎగిసిపడే)

చిత్రం : దేవర (2024)

సంగీతం : అనిరుధ్ రవి చందర్

గీత రచయిత : రామజోగయ్య శాస్త్రి

నేపధ్య గానం : కాల భైరవ



ఎర్రటి సంద్రం ఎగిసిపడే
అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు
మన జట్టుగ ఆడెను సూడు
హే ఉప్పూగాలే నిప్పుల్లో సెగలెత్తే
హే డప్పూమోతలు దిక్కుల్లో ఎలుగెత్తే
పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే
పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తె
హైలా హైల ఇయ్యాల
ఆయుధ పూజ చెయ్యాలా
జబ్బలు చరచాలా
జరుపుకోవాలా జాతర
వీరాధి వీరుల జాతి తిరణాల
ఉడుకు రకతాలా
హారతులియ్యాలా రార ధీర హో
ధీర హో
హైల ఇది అలనాటి ఆచారమే
ఇదిలా కొనసాగందే అపచారమే
బతుకే నేడు రణమైన పరివారమే
కడలి కాలం సాక్ష్యమే
మన తల్లుల త్యాగాలే
చనుబాలై దీవించే
కనుకే ఈ దేహం
ఆయుధమై ఎదిగింది
తల వంచని రోషాలే
పొలిమేరలు దాటించే
మన తాతల శౌర్యం
చరితలుగా వెలిగింది
ఏటేటా వచ్చే ఈ రోజే మన కోసం
మెలితిప్పిన మీసం
మనమిచ్చే సందేశం
హైలా హైల ఇయ్యాల
ఆయుధ పూజ చెయ్యాలా
జబ్బలు చరచాలా
జరుపుకోవాలా జాతర
వీరాధి వీరుల జాతి తిరణాల
ఉడుకు రకతాలా
హారతులియ్యాలా రార ధీర హో
ఎర్రటి సంద్రం ఎగిసిపడే
అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు
మన జట్టుగ ఆడెను సూడు

Devara : Daavudi Daavudi Song Lyrics (కొర్రమీన నిన్ను కోసుకుంటా )

చిత్రం : దేవర (2024)

సంగీతం : అనిరుధ్ రవి చందర్

గీత రచయిత : రామజోగయ్య శాస్త్రి

నేపధ్య గానం : నకాష్ అజీజ్, అకాసా


పల్లవి:

కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల
పొయ్యిమీన మరిగిందె మసాలా
చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
కసిమీన తొలి విందులియ్యాల
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియో
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
యే వాది వాది రే
యే వాది వాది రే
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది

చరణం 1:

నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి
నన్నెక్కించావే పిల్లా రెక్కల గుర్రాన్ని
ఆకట్టుకుంది ఈడు ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని
నల్కీసు నడుం గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే
సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే
ఇంకేంది ఎడం
కస్సున బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
హక్కుగ మొక్కుగ భల్లేగ దక్కావే
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియో
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
యే వాది వాది రే
యే వాది వాది రే
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది

Devara : Chuttamalle Song Lyrics (చుట్టమల్లే చుట్టేస్తాంది)

చిత్రం : దేవర (2024)

సంగీతం : అనిరుధ్ రవి చందర్

గీత రచయిత : రామజోగయ్య శాస్త్రి

నేపధ్య గానం : శిల్పా రావు


పల్లవి:

చుట్టమల్లే చుట్టేస్తాంది ..తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపూ
అస్తమానం నీలోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపూ రా నా నిద్దర కులాసా..నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాశా రా నా ఆశలు పోగేశా..నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్దం చేశా ఆ ఎందుకు పుట్టిందో పుట్టింది..ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది ఆ పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది..గోరింట పెట్టింది ఆ
సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది..చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ ఆ ఆ అరరారే చుట్టమల్లే చుట్టేస్తాంది..తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు

చరణం 1:
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరీ
వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమే నీ సందడి
ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారీ రా ఈ బంగరు నెక్లేసు
నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నన్ను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి
నన్ను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు ఆ ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది ఆ పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టిందిఆ
సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ ఆ ఆ అరరారే చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు