Dhamaka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Dhamaka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2023, బుధవారం

Dhamaka :Jinthaak Song Lyrics (జింతక జింతక జింతక)

చిత్రం: ధమాకా (2023)

సాహిత్యం: కాసర్ల శ్యామ్

గానం: భీమ్స్ సిసిరోలియో & మంగ్లీ

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

(F) ఎంకన్న తీర్థంలో యాళ్ళ పొద్దు మూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తె నువ్వు కడుతుంటే ఏ కన్ను సూడకుండా కన్ను నాకు కొడుతుంటే ఎఏ…ఎఏ.. ఎఏ హే… నిన్ను సూడబుద్దైతాంది రాజిగో మాటాడా బుద్దయితాంది రాజిగో.. (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (F) చెయ్యి పట్టబుద్ధాయితాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధయితాంది రాజిగో (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (M)అట్టా అంటుంటే మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో.. భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో కొంప గోడు కట్టుకుంటా కౌగిళ్ళో.. (F) నిన్ను జూత్తే... నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (M) నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక Charanam - - 1 (F)నా బెత్తెడంత నడుమొంపుల్లో ఉంగరాలో.. బొంగరాలో.. నీ సూపుతాడు సుట్టి తిరగాలో గింగిరాలో.. (M) నా ఛాతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలో నువ్వు చెమట చుక్కల్లెక్క పెట్టాలే.. ఇయ్యాలో (F) రోజు మార్చాలిరా చేతి గాజులు నలిగి ముల్గాలిరా సన్నజాజులు (M) పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టె మంచంకే పుట్టే నొప్పులు (F) హా.. నిన్ను జూత్తే..నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది (M chorus) జింతక్ జింతక్ జింతక్ జజ్జన జింతక్ జింతక్ జింతక్ (M) నన్ను సూత్తే.. అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది.. ఏయ్. (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక Charanam - - - 2 (F)నే నీళ్లు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో నువ్వు కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో (M) ఎన్ని ఏండ్లు గాని సంటి పోరడ్నే ఓ పిల్లో నీ ఒళ్ళో నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్ళో (F) నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నే తప్పుతు ఉంటా.. మాసాలు (M) అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు ఇంకా చద్దర్లో చేద్దామే తిరునాళ్ళు (F) హా.. నిన్ను జూత్తే..నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది.. గుండె గట్టిగ కొట్టేసుకుంటాది (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (M) నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది.. ఏయ్. (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (F) నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది.. గుండె గట్టిగ కొట్టేసుకుంటాది (M) నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది