Eega లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Eega లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, నవంబర్ 2021, బుధవారం

Eega : My Name is Nani Song Lyrics

చిత్రం: ఈగ (2012)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: దీపు, రాహుల్ శిల్పిగూంజ్, శ్రావణ భార్గవి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


దేఖ్‌లోరె సాలా యే రాత్ చాగయి  తేరే ద్వార్ పె తేరీ మౌత్ ఆగయీగ..ఈగ..ఈగ..ఈగ.....  my name is nani నేనీగనైతే కాని  నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ని  my name is nani నేనీగనైతే కాని  నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ని  నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ  నీ కింగ్‌డంనే కూల్చకుంటే కానురా మగాన్ని  ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ  ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా  ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ  ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా  అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన  అడవినైనా కాల్చే కసి నిప్పు దాగి లేదా  చిటికేనా వేలఅయినా చినుకు బొట్టులోన  పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచిలేదా  listen the universe is an atom before the bigbang  ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా  అని యమ కేర్‌ఫ్రీగా నువ్వు ఆవలించేలోగా  నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్ లాగా...ఆ..ఆ...  ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ  ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా  ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ  ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా  యమ అర్జంటుగా పూర్తిచెయ్యవలసిన పనులున్నాయ్  పదే పది.. పదే పది..  వన్.. నిన్ను చంపడం టూ.. నిన్ను చంపడం త్రీ.. నిన్ను చంపడం  ఫోర్.. నిన్ను చంపడం ఫైవ్.. నిన్ను చంపడం సిక్స్.. నిన్ను చంపడం  సెవెన్.. నిన్ను చంపడం ఎయిట్.. నిన్ను చంపడం నైన్.. నిన్ను చంపడం  టెన్.. నిన్ను ముసిరి ముసిరి ముసిరి ముసిరి  తరిమి తరిమి తరిమి తరిమి పొడిచి పొడిచి పొడిచి చంపడం  రెపరెపరెపరెప రెక్కలను విదిలిస్తాగా  నీ చెవ్వుల్లోన మరణ రాగ వినిపిస్తాగా  సూసైడ్ బాంబర్‌నై నీ పైకి దూసుకొస్తా  by hook or crook నిన్ను చంపి మరోసారి చస్తా  ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా  ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా  అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా  తగిలిబెట్టి ఎగిరిపోనా తారాజువ్వ లాగా...ఆ..ఆ...  ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ  ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా  ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ  ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా


15, నవంబర్ 2021, సోమవారం

Eega : Konchem Konchem Song Lyrics (కొంచెము అర్థమయినా..)

చిత్రం: ఈగ (2012)

రచన: అనంత శ్రీరామ్

గానం: విజయ్ ప్రకాష్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



కొంచెము అర్థమయినా.. కొంచెము కొంచెము కాకపోయినా ... కొంచెము బెట్టు చూపినా... కొంచెము కొంచెము గుట్టు విప్పినా... కొంచెము కసురుకున్నా.. మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా...ఓ... నీ గుండె లోతున భూతద్దమేయనా ఏదో మూలన నన్నే చూడనా.. నీ గుండె లోతున భూతద్దమేయనా ఏదో మూలన నన్నే చూడనా.. కొంచెము చూడవచ్చుగా..కొంతైనా మాటాడవచ్చుగా.. పోనీ అలగవచ్చుగా..పొగడాలంటే అడగవచ్చుగా.. నీకై మెల్ల మెల్లగా పిచ్చోడ్నౌతున్నా జాలి పడవుగా..ఓ.. పిసనారి నారివే పిసరంత పలకవే ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా పిసనారి నారివే పిసరంత పలకవే ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా... కాకితో కబురు పంపినా..కాదనకుండా వచ్చి వాలనా.. రెక్కలు లేకపోయినా..చుక్కలకే నిను తీసుకెళ్లనా.. జన్మలు ఎన్ని మారినా..ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా..ఓ.. నీ గుండె గూటిలో..నా గుండె హాయిగా .. తలదాచుకుందని తెలియలేదా... వాట్ డిడ్ యూ సే... నీ గుండె గూటిలో.. నా గుండె హాయిగా... తల దాచుకుందని... తెలియలేదా....