Ela Cheppanu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ela Cheppanu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2021, ఆదివారం

Ela Cheppanu : Meghala Pallakilona Song Lyrics (మేఘాల పల్లకిలోన)

చిత్రం       :  ఎలా చెప్పను(2003)

సంగీతం    :  కోటి

రచయిత   :  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం       :   శ్రీరామ్ ప్రభు, సునీత


మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య(2)

మిలమిల మెరిసిన శశికళ

చినుకులా కురిసిన హరివిల్లా

గుడిలో దివ్వలా గుండెలో మువ్వలా

ఎగిరే గువ్వలా ఎదిగే పువ్వులా

నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానలా

అందాల మందార కొమ్మా

అల్లారు ముద్దైన బొమ్మా


నీలా నవ్వాలని నీతో నడవాలని

పచ్చని పండుగ వచ్చింది

చల్లని కబురు తెచ్చింది

వచ్చే నూరేళ్ళ కాలానికి నువ్వే మారాణివంటున్నది

ప్రతి రోజులా ఒక రోజా ఇది

ఏడాదిలో మహారాజే ఇది

లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది

తన ఒడిలో పుట్టింది అంటున్నది


నన్నే మరిపించగా నిన్నే మురిపించగా

ప్రతి రాతిరి వేళల్లో రాని చందమామయని

నీ కలువ కన్నుల్లో ఎన్నో కళలు నింపాలని

నీకోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం

నిన్నటి కన్నా రేపెంతో మిన్న చూడమన్న ఆశతో

సందడిగా చేరింది సంతోషం

Ela Cheppanu : Ee Kshanam Oke Oka Song Lyrics (ఈ క్షణం ఒకే ఒక కోరిక..)

చిత్రం       :  ఎలా చెప్పను(2003)

సంగీతం    :  కోటి

రచయిత   :  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం       :  చిత్ర


ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..

ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..

తరగని దూరము లో ఓ .. ఓ....

తెలియని దారుల లో ఓ .. ఓ....

ఎక్కడున్నావు అంటోంది ఆశగా..

ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..



ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది..

ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది..

నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది...

ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..

మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ..

ఆరాటంగా కొట్టుకున్నది..

ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..



రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది..

రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి ..

నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని..

ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..

ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ ..

నిద్దరోను అంటోంది..


ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..

తరగని దూరము లో ఓ .. ఓ....

తెలియని దారుల లో ఓ .. ఓ....

ఎక్కడున్నావు అంటోంది ఆశగా..


Ela Cheppanu : Manninchu O Prema Song Lyrics ( ఓ ప్రేమా ప్రేమా ప్రేమా.)

చిత్రం       :  ఎలా చెప్పను(2003)

సంగీతం    :  కోటి

రచయిత   :  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం       :  ఉదిత్ నారాయణ్, చిత్ర


ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...

మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా

మౌనాలు కరిగించేలా మాటాడుమా

మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా

దరిచేరు దారేదైనా చూపించుమా

చెప్పనంటు దాచడానికైనా

అంత చెప్పరాని మాట కాదు ఔనా

ఇంత మంచి వేళ ఎదురైనా

మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా

పట్టరాని ఆశ పెంచుకున్నా

అది మోయరాని భారమవుతున్నా

చెప్పుకుంటే తప్పు లేదు అయినా

నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న...

ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...

మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా

మౌనాలు కరిగించేలా మాటాడుమా


జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా

కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా

రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా

చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా

చొరవగా... పొదువుకో.. నడిపే ప్రణయమా

బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా

తగిన తరుణమని ఉదయ కిరణమై

ఎదురుపడిన వరమా

మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా

మౌనాలు కరిగించేలా మాటాడుమా


అన్నివైపులా చెలిమి కాపలా అల్లే బంధమా

మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా

నిదురలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా

కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా

తలపునే... తెలుపవే... నాలో ప్రాణమా

పెదవిపై పలకవే.... ఊహా గానమా

మదిని మీటినది నీవు కాదా మరి మధురమైన స్వరమా

మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా

మౌనాలు కరిగించేలా మాటాడుమా

చెప్పనంటు దాచడానికైనా

అంత చెప్పరాని మాట కాదు ఔనా

ఇంత మంచి వేళ ఎదురైనా

మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా

ఓ ప్రేమా ప్రేమా ప్రేమా... ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...


Ela Cheppanu : Magha Maaasa Vela Song Lyrics (మాఘమాస వేళ కోకిలమ్మ పాట)

చిత్రం       :  ఎలా చెప్పను(2003)

సంగీతం    :  కోటి

రచయిత   :  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం       :  ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్



కళలు చిలుకు అలివేణి నుదుట కస్తూరి తిలకమును దిద్దరే సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు పసుపుతో నిగ్గు పెంచరే కొత్త వెలుగు చూపించగలుగు పారాణి పూసి నడిపించరే కన్నె గోదారి వధువుగా మారి కడలి కౌగిలికి చేరు తరుణమిది వేడుకైన కళ్యాణ సమయమిది మాఘమాస వేళ కోకిలమ్మ పాట ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట అనురాగం తోడురాగా నవలోకం ఏలుకోగా శుభలగ్నం చేరుకుందని పిలిచేలా ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... మాఘమాస వేళ కోకిలమ్మ పాట తందాన తందాన తానాన తానానా తందాన తందాన తననన నా... ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా ఎదురయేది నువ్వే నీకు తెలుసునా.. నిను కలవని రోజున గడవదు ఏం చేసినా వదలనంది నన్నే తీపి యాతన నువ్వు వెతికే మజిలీ అవనా..... నెచ్చెలిగా మదిలో చేరనా..... ఇక అటు ఇటు ఎగరకే పావురమా నా కౌగిలి కొలువున స్థిరపడుమా తలపును దోచిన దొరతనమా నా అనుమతి తమకిక అవసరమా నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ మాఘమాస వేళ కోకిలమ్మ పాట మనసుకి మలి జన్మగా.. నువు మలిచిన బొమ్మగా.. నిన్ను అల్లుకోనీ.. కొత్త ఊపిరి.. హో గగనము దిగి నేరుగా ప్రియసఖిలా చేరగా.. నన్ను కలుసుకుందా నింగి జాబిలి నా మనవిని విననే వినవా..... ఇది నిజమని అననే ఆనవా..... నది నడకలు నేర్పిన సాగరమా నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా తెలియని సైగల స్వాగతమా ఈ బిడియము దేనికే సోయగమా ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రేమ మాఘమాస వేళ కోకిలమ్మ పాట అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా శుభలగ్నం చేరుకుందని పిలిచేలా ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...  ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...