Gaali Medalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gaali Medalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Gaali Medalu : Ee Mooga Chupelara Song Lyrics (ఈ మూగ చూపేలా బావా)

చిత్రం: గాలి మేడలు (1962)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

సంగీతం: టి జి లింగప్ప

గానం: ఘంటసాల, రేణుక


పల్లవి:

ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా నీ దరి నే చేరి మాటాడనా  ఓహో .. ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా


చరణం 1: రెప్పేయకుండా ఒకే తీరున నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ ఓహోహో హో

రెప్పేయకుండా ఒకే తీరున నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే

ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే చేయీ చేయీ చేరా విడీపోవులే

ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా


చరణం 2: చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటదీ ఆహాహా హా

చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటదీ ఆహాహా హా నా ముందు నిలుచుండి నువు నవ్వితే

నా ముందు నిలుచుండి నువు నవ్వితే నా మనసే అదోలాగ జిల్లంటదే

ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా

చరణం 3:

జాగర్త బావా చెయీ గాజులు ఇవీ కన్న చిన్నారి తొలి మోజులూ ఓహోహో

జాగర్త బావా చెయీ గాజులు ఇవీ కన్న చిన్నారి తొలి మోజులూ చాటేనె ఎలుగెత్తి ఈ గాజులే

చాటేనె ఎలుగెత్తి ఈ గాజులే ఈవేళా మరే వేళ మన రోజులే ఈ మూగ చూపేలా బావా మాటడగా నేరవా ఓహో మాటడదీ బొమ్మా