Gandikota Rahasyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gandikota Rahasyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మార్చి 2022, శుక్రవారం

Gandikota Rahasyam : Maradala Pillaa Song Lyrics (మరదల పిల్ల ఎగిరిపడకు)

చిత్రం: గండికోట రహస్యం (1969) సంగీతం: టి.వి. రాజు గీతరచయిత: సి. నారాయణ రెడ్డి నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి: మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా.. చరణం 1: మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. ముట్టుకుంటే గుబులౌతుంది మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. ముట్టుకుంటే గుబులౌతుంది కోడెత్రాచులా వయసుంది.. అది కోరుకుంటే దిగులౌతుంది కోడెత్రాచులా వయసుంది.. అది కోరుకుంటే దిగులౌతుంది ఆ కోపంలో భలే అందముంది.. ఆ కోపంలో భలే అందముంది మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా.. చరణం 2: కసురుకుంటే కవ్విస్తానూ..ఊ.. విసురుకుంటే ఉడికిస్తాను కసురుకుంటే కవ్విస్తానూ..ఊ.. విసురుకుంటే ఉడికిస్తాను ముక్కు తాడు తగిలిస్తాను.. ఆ మూడుముళ్ళు వేసేస్తాను ముక్కు తాడు తగిలిస్తాను.. ఆ మూడుముళ్ళు వేసేస్తాను ఏనాడైనా నీ వాడ నేను.. ఏనాడైనా నీ వాడ నేను.. మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు 

నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా..