Gayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జనవరి 2022, గురువారం

Gaayam : Naizamu Pori song Lyrics (పాడనా గోపాలా )

చిత్రం: గాయం (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మనో, చిత్ర,ఈశ్వర్

సంగీతం: శ్రీనివాస్ కొమ్మినేని




ఆ.. పాడనా గోపాలా కమ్మగా కైపే కమ్మగా కళ్ళే వాలగా ఊపనా ఉయ్యాల మెల్లగా చల్లచల్లగా ఒళ్ళే తేలగా నైజాం పోరీ నస్దీక్ చేరి నవ్వింది ఓసారి నా జంటకోరి నకరాల మారి వచ్చింది బై ప్యారీ బాగుంది బై జర లాగింది బై దిమాక్ బాయ్ దిల్ దిమ్మెక్కి బాయ్ పంజగుట్టతాన చూసి పంజరాన పెడ్తమంటే పత్తాలేక పారిపోయెరో జింగారే జీగ్ చాక్ జింగ్ చాక్

జింగారే జీగ్ చాక్ జింగ్ చాక్ జింగారే జింగ్ చాక్ జింగ్ చాక్

జింగారే జింగ్ చాక్ జింగ్ చాక్ పైటను చూడగానే పైత్యమొస్తదా పాడుబుద్ధి కోడెగాళ్ళు పడ్తరేమి మీదమీద పైలాపచ్చీస్ ఈడు గమ్మునుంటదా మన్నుదిన్న పాములెక్క ఊరుకుంటే పరువుబోదా పబ్లిక్ చూస్తరన్న ఖాతరుండదా ఇజ్జత్ పోతదన్న ౙానమైనా కాస్తలేదా ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా ఊకెనే ఉండమంటే మంచి మౌకా జారిపోదా ఆహాహా... ఆ ఆ ఆ...వామ్మో వద్దమ్మో కిక్కూ ఊపూ అరె ఉండాలమ్మో గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమక్ చమక్ చిలకా జింగారే జింగ్ చాక్ జింగ్ చాక్

జింగారే జింగ్ చాక్ జింగ్ చాక్ *యాద్గిరిగుట్ట కాడ ఎదురుబడ్డది ధూత్ తేరీ అంట నన్ను గుస్సాజేసి కస్సుమంది ఒంటరి ఆడపిల్ల అంత లోకువా ?? తుంటరి పిల్లగాడా అక్క సెల్లి నీకులేరా ?? అరె మస్తిన్నం తీయ్ తీయ్ అక్కలు సెల్లెళ్ళు అందరుండినా సక్కని సుక్కలాంటి ఆలి తక్కువాయె మల్ల కం కం బేబీ డోంట్ బీ షై వై డోంట్ యూ టేక్ మీ ఆనే డేట్ విత్ యూ ఓ మై లవ్ మై డార్లింగ్.. యా ఏ ఏ ఏ.. ఏందయ్యో ఏందా స్పీడు లేదా బ్రేకు అరె ఆటాపాటా సాగాలంట ఫికర్ దేనికంట నైజాం పోరీ నస్దీక్ చేరి నవ్వింది ఓసారి నా జంటకోరి నకరాల మారి వచ్చింది బై ప్యారీ బాగుంది బై జర లాగింది బై దిమాక్ బాయ్ దిల్ దిమ్మెక్కి బాయ్ పంజగుట్టతాన చూసి పంజరాన పెడ్తమంటే పత్తాలేక పారిపోయెరో జింగారే జింగ్ చాక్ జింగ్ చాక్

జింగారే జింగ్ చాక్ జింగ్ చాక్

27, నవంబర్ 2021, శనివారం

Gaayam : Niggadisi Adugu song Lyrics (నిగ్గ దీసి అడుగు)

చిత్రం: గాయం (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: శ్రీనివాస్ కొమ్మినేని


నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలం గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం యే క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్ఠం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా వేట అదే వేటు అదే నాటి కధే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలం||

6, జూన్ 2021, ఆదివారం

Gaayam : Alupannadi Unda song (అలుపన్నది ఉంద ఎగిరె అలకు)

 

చిత్రం: గాయం

సంగీతం: శ్రీ

గానం: చిత్ర

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


అలుపన్నది ఉంద ఎగిరె అలకు యదలోని లయకు అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలల అలుపన్నది ఉంద ఎగిరె అలకు యదలోని లయకు అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు నా కోసమే చినుకై కరిగి.. ఆకశమే దిగద ఇలకు నా సేవకే సిరులె చిలికి.. దాసోహమే అనదా వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావా న ఊహలకు కలలను తేవా న కన్నులకు లల లల లలలల అలుపన్నది ఉంద ఎగిరె అలకు యదలోని లయకు అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు నీ చూపులే తడిపె వరకు.. ఏమైనదో నాలొ వయసు నీ ఊపిరే తగిలె వరకు.. ఎటు ఉన్నదో మెరిసె సొగసు ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగ నడిచే తొలి ఆశలకు లల లల లలలల అలుపన్నది ఉంద ఎగిరె అలకు యదలోని లయకు అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు మెలికలు తిరిగె నది నదకలకు మరి మరి ఉరికె మది తలపులకు లల లల లలలల