చిత్రం: ఘటోత్కచుడు (1995)
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ
కడుపార నిన్ను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంటి చెమ్మ
తను మరుగునున్న నిన్ను మరువదమ్మ
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ .
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ
చరణం:1
ఆకలందంటే ఆ చిన్ని బొజ్జ
అడగకుండానే తెలుసుకోమంది
ఆటాడుకోగా తోడెవ్వరంటే
అంబారి కట్టి ఆడించమంది
నీకేం కావాలన్నా
నాకు చెపుతూ ఉంటానంది
తానే లోకానున్న నిన్ను చూస్తూ ఉంటానంది
కాపాడుకుంటా కనుపాపలాగా
నిను చూసుకుంటా మీ అమ్మలాగా
నమ్మమ్మ నా మాటను ...
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ
చరణం:2
మావయ్యనంటూ నిన్ను చెరమన్ది
మంచి మాటలతో మరిపించమంది
కథలెన్నో చెప్పి నవ్వించమంది
ఒడిలోన చేర్చి వోదార్చమంది
జో జో పాపా అంటూ తాను రోజు పాడే లాలి
ఇట్టా పాడాలంటూ నాకు తానే నేర్పింది తల్లి
మా పాపనెప్పుడు కాపాడమంటూ
దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే పని మీద వెళ్ళింది .
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ
కడుపార నిన్ను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంటి చెమ్మ
తను మరుగునున్న నిన్ను మరువదమ్మ
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ .
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ