Gopi Gopika Godavari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gopi Gopika Godavari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జనవరి 2025, ఆదివారం

Gopi Gopika Godavari : Sundari Song Lyrics (సుందరివంటే నువ్వేనంటు)

చిత్రం: గోపి గోపిక గోదావరి(2009)

రచన:  రామజోగయ్య శాస్త్రి

గానం: వేణు, మధుమిత

సంగీతం: చక్రి



పల్లవి:

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
సుందరివంటే నువ్వేనంటు చందరవంకే
నీపేరంటు ముద్దులహారం మెళ్ళో వెయ్యనా
అబ్బబ్బా...
బందరులడ్డూ నువ్వేనంటు బంగరుజింకై దూకావంటూ
ఇందరలోకం రాసిచ్చెయ్యనా
అబ్బబ్బా...
నువ్వు ముద్దన్నాక వద్దొద్దంటానా
అట్టా హద్దే దాటి రావద్దంటానా...
ఆడ ఈడ నన్ను తాకొద్దంటానా
కొంటె తాపాలేవొ పెంచొద్దంటానా...
అమ్మో అంతొద్దంటున్నా నిండా ముంచొద్దంటున్నా
ఏదో సరదాకన్నానే లలనా
రాణీ నువ్వేలెమ్మన్నా రాజీకొస్తానంటున్నా
పేచీ పెడితే ఎట్టాగే సుగుణా
చాల్లే చాలేగాని పోతేపోని సద్దేలేని బాతాఖానీ
ఐసా పైసా కానీ అంటున్నా

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
సుందరివంటే నువ్వేనంటు చందరవంకే
నీపేరంటు ముద్దులహారం మెళ్ళో వెయ్యనా
అబ్బబ్బా...
బందరులడ్డూ నువ్వేనంటు బంగరుజింకై దూకావంటూ
ఇందరలోకం రాసిచ్చెయ్యనా
అబ్బబ్బా...

చరణం 1:

పైటే జారే మగువా ఏదో కోరే తెగువా ఏకై వచ్చి మేకైపోయావా...
చెంగేలాగే చొరవా చెంతేఉన్నా కలువా చుట్టూపక్కల చూస్తా ఉంటావా...
మూర్తాలన్ని ముడిపడని నీనోరే పండే తాంబూలాన్ని నేనవనా
వారం వర్జ్యం చూసుకొని నువ్వొచ్చేలోగా ఉసూరంటూ దిగులవనా
తాత్తై తత్తత్తై చిందులన్ని ఆపేసెయ్ ఈసారిట్టా పోనీలేవమ్మా

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
సుందరివంటే నువ్వేనంటు చందరవంకే
నీపేరంటు ముద్దులహారం మెళ్ళో వెయ్యనా
అబ్బబ్బా...
బందరులడ్డూ నువ్వేనంటు బంగరుజింకై దూకావంటూ
ఇందరలోకం రాసిచ్చెయ్యనా
అబ్బబ్బా...

చరణం 2:

అయ్యో పాపం అనవా నామాటేదీ వినవా అవి ఇవి ఇచ్చెయ్ గురువా...
సింగారాల వరువా శీతాకాలం చలవా పైపైకొచ్చి వేడెక్కిస్తావా...
రారమ్మంటే ఏదో పనిగా ఇందాక వచ్చా తీర వస్తే సిల్లీ గోడవా...
రై రై అంటూ రగే తేనీగా నీకంట్లో కచ్చా ఆర్చేదాకా ఓర్చగలవా ...
ఆశై అత్యాశై అల్లల్లాడే అర్జెంటై నీవైపొచ్చా సాయం చెయ్యవా...

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
సుందరివంటే నువ్వేనంటు చందరవంకే నీపేరంటు
ముద్దులహారం మెళ్ళో వెయ్యనా
అబ్బబ్బా...
బందరులడ్డూ నువ్వేనంటు బంగరుజింకై దూకావంటూ
ఇందరలోకం రాసిచ్చెయ్యనా
అబ్బబ్బా...
నువ్వు ముద్దన్నాక వద్దొద్దంటానా అట్టా హద్దే దాటి రావద్దంటానా...
ఆడ ఈడ నన్ను తాకొద్దంటానా కొంటె తాపాలేవొ పెంచొద్దంటానా
హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి

2, జులై 2021, శుక్రవారం

Gopi Gopika Godavari : Nuvvakkadunte Song Lyrics (నువ్వక్కడుంటే నేనిక్కడుంటే)

చిత్రం: గోపి గోపిక గోదావరి(2009)

రచన:  రామజోగయ్య శాస్త్రి

గానం: చక్రి, కౌసల్య

సంగీతం: చక్రి


పల్లవి:

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానందీ వేళా
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

చరణం 1:

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నైలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

చరణం 2:

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరఫున గీత చెరపనా
ఎంత దూరాన నీవున్నా నితోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీవేళ గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల