చిత్రం: గుణ (1991)
రచన: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ
సంగీతం: ఇళయరాజా
అతడు: ఉ రాయి.. రాయీ.. ఆమె: ఎం రాయాలి.. అతడు: లెట్టెర్ .. ఆమె: ఎవరికి.. అతడు: నీకు ఆమె: నాకా.. అతడు: ఉ..
అతడు: నాకు రాయటం రాదు..
ఈ మధ్యనే సంతకం పెట్టటం నేర్చుకున్నా..
ఆమె: వెయిట్ వెయిట్.. నాకు నువు రాసే ఉత్తరం నేను రాసి..
ఆమె: వెయిట్ వెయిట్.. నాకు నువు రాసే ఉత్తరం నేను రాసి..
అతడు: నాకు చదివి వినిపించి తరువాత నువ్వు చదువుకోవాలి..
ఆమె: ఐ లైక్ ఇట్ .. ఉ చెప్పు..
అతడు: నా ప్రియా..ప్రెమతొ.. నీకు.. నే.. నేను.. రాసే.. ఉత్తరం ..
లెట్టెర్ .. ఛ.. లెట్టెర్.. కాదు.. ఉత్తరవే.. అని రాయి.. చదువు..
ఆమె: కమ్మని ఈ ప్రేమలేఖని రాసింది హౄదయమే..
అక్కడ ప్రియతమా అని మార్చుకో..
ప్రియతమా..నీ ఇంట్లో క్షేమమా.. నేను ఇక్కడ క్షేమం..
ఆమె: ప్రియతమా.. నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
కవిత మనసులొ వరదలా పొంగుతుంది..
కానీ.. అదంతా రాయాలని కూర్చుంటే.. అక్షరాలే..మాటలే..
అక్కడ ప్రియతమా అని మార్చుకో..
ప్రియతమా..నీ ఇంట్లో క్షేమమా.. నేను ఇక్కడ క్షేమం..
ఆమె: ప్రియతమా.. నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
కవిత మనసులొ వరదలా పొంగుతుంది..
కానీ.. అదంతా రాయాలని కూర్చుంటే.. అక్షరాలే..మాటలే..
అతడు: పాటలా మార్చి రాసావా.. అప్పుడు నేనుకూడ మారుస్తా....
మొదట..నా ప్రియా.. అన్నాకదా..
అతడు: ఆహ..ఓహొ కవిత్వం .. నేను ఉహించుకుంటే
ఆమె: ఊహలన్నీ పాటలే..కనుల తోటలో..
అతడు: అదే..
ఆమె: తొలి కలల కవితలే.. మాట మాట లో..
అతడు: అదే.. ఆహా.. బ్రహ్మాండం..కవిత కవిత..ఉ..పాడు..
ఆమె: కమ్మని ఈ ప్రేమలేఖని రాసింది హౄదయమే..
ప్రియతమా నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
ప్రియతమా నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
ఊహలన్నీ పాటలే..కనుల తోటలో..
తొలి కలల కవితలే.. మాట మాట లో..
అతడు: ఒహో..
ఆమె: కమ్మని ఈ ప్రేమలేఖని రాసింది హౄదయమే..
అతడు: లాలలా..లాలాల లాలాల లాలలా..
ఆమె: ప్రియతమా నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
అతడు: లాలలా..లాలాల లాలాల లాలలా..
అతడు: నాకు తగిలిన గాయం అదే.. చల్లగ మానిపోతుంది..
అదెవిటో నాకుతెలీదు..ఎమ్మాయో తెలీదు..
నాకేవీకాదసలు..
ఇదికూడా..రాసుకో..అక్కడక్కడా..పువ్వు నవ్వు ప్రేమ..
అదెవిటో నాకుతెలీదు..ఎమ్మాయో తెలీదు..
నాకేవీకాదసలు..
ఇదికూడా..రాసుకో..అక్కడక్కడా..పువ్వు నవ్వు ప్రేమ..
అలాంటివి వెసుకోవాలి..ఆ..
ఇదిగో చూడు..
నాకు ఏ గాయమైనప్పటికీ వొళ్ళు తట్టుకుంటుంది..
నీ వొళ్ళు తట్టుకుంటుందా..
ఇదిగో చూడు..
నాకు ఏ గాయమైనప్పటికీ వొళ్ళు తట్టుకుంటుంది..
నీ వొళ్ళు తట్టుకుంటుందా..
తట్టుకోదు.. ఆమె.. దేవి ఆమె..
ఆమె: అది కూడ.. రాయాలా..
ఆమె: అది కూడ.. రాయాలా..
అతడు: అహ హ .. అది ప్రేమ..నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక..
ఇదవ్వుతుంటే.. ఏడుపొస్తుంది..
కాని.. నేనేడ్చి.. నాశోకం నిన్నుకూడ..
బాధపెడుతుందనుకున్నప్పుడు,
వచ్చే కన్నీరు కూడా.. ఆగుతుంది..
మనుషులు అర్ధం చేసుకునేందుకు
ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలాగ స్వచ్చమైనది..
ఆమె: గుండెల్లొ గాయమేమో చల్లంగ మానిపోయె..
మాయజేసె ఆమాయె ప్రేమాయె..
ఎంత గాయమైనగాని.. నామేనికి ఎమికాదు..
పూవుశోకి నీమేను కందేనే..
వెలికిరాని వెర్రి ప్రేమ..
కన్నీటి ధారలోన కరుగుతున్నదీ..
నాదు శోకమోపలేక నీగుండె బాధపడితే.. తాళనన్నదీ..
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు..
అగ్నికంటె స్వచ్ఛమైనదీ..
అతడు: మమకారమే ఈ లాలిపాటగారాసేది హౄదయమా..
ఆమెగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా..
శుభలాలిలాలిజో.. లాలిలాలిజో..ఆమె లాలిజో లాలిజో.
మమకారమే ఈ లాలిపాటగారాసేది హౄదయమా.. నా హౄదయమా..