Illu Illalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Illu Illalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2025, శనివారం

Illu Illalu : Vinara Sooramma Koothuri mogudaa Song Lyrics (వినరా సూరమ్మ కూతురి మొగుడా...)

చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

రచన: అప్పలాచార్య

గానం: యస్.జానకి, రాజబాబు



పల్లవి:

వినరా సూరమ్మ కూతురి మొగుడా...
విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ
వినరా సూరమ్మ కూతురి మొగుడా...
విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ
చెప్పు మలీ
కారు మబ్బులూ కమ్మిన వేళా...
కాకులు గూటికి చేరే వేళ...కా..కా...
చందమామ తొంగి చూసేవేళా ...
సన్నజాజులు పూసే వేళ ..అహా...ఓహో...
ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..
ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే
లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో...
ఏం జలిగింది...
తలుపు కిర్రునా చప్పుడైనది...
గుండె ఝల్లునా కొట్టుకున్నది...
తలుపు కిర్రునా చప్పుడైనది...
గుండె ఝల్లునా కొట్టుకున్నది...
మెల్ల మెల్లగా కళ్ళు తెరచి
నే వచ్చినదెవరో చూశాను...

చరణం 1:

ఎవలాలూ...
నల్లనివాడు...గుంట కన్నుల వాడు ..
గుబురుమీసాల వాడు ...అయ్యబాబోయ్...
ఆరడుగుల పొడుగు వాడు ...
ముద్దులిమ్మని నన్ను అడిగినాడు ...
ఏయ్ వాన్ని నే నలికేస్తాను....

నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ మొగముదాచుకొన్నా...
పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడూ ...
అమ్మా...నాన్నా....
అమ్మా...నాన్నా...కాపాడమంటూ...అల్లాడిపోయాను..
అయినా కానీ వదలక నన్ను ఒడిసిపట్టినాడు...
అంతలో వచ్చింది... ఏమిటీ మూల్చా?
కాదు... మా అమ్మ... వచ్చి ఏమంది?

చరణం 2:

వెళ్ళవే నా తల్లి... వెళ్ళవే అమ్మా...
ముద్దులిస్తే... నీకు డబ్బులిస్తాడు...
మంచి బట్టలిస్తాడు... డబ్బులిస్తాడు...
మంచి బట్టలిస్తాడు....అని ముందుకి తోసింది
ఛీ అది తల్లా.. కాదు లాక్షసి..పిచాచి...దెయ్యం.... తరవాతేమయిందో చెప్పు ...
తప్పనిసరియై వెళ్ళేను ...సిగ్గుపడుతు నిలుచున్నాను
గదిలోకెత్తుకు పోయేడు కథలూ కబుర్లు చెప్పేడు...
తన దుప్పటిలో చోటిచ్చేడు...

చరణం 3:

ఛీ.. కులటా పాపాత్ములాలా...నువ్వు నాకొద్దు ఫో.. వాడిదగ్గిరికే పో...
అంతకోపం ఎందుకయ్యా ...అప్పుడు నావయసైదయ్య ...
ఏంటీ నీ ఆప్పుడు కైదేల్లా..ఆ...
అంత కోపం ఎందుకయ్యా... అప్పుడు నావయసైదయ్యా ...
ఆ వచ్చినదీ మా తాతయ్య...
తాతయ్య....తాతయ్య....
తాతయ్య....తకతయ్యా..
తాతయ్య....తకతయ్యా..
తాతయ్యా...నేనింకా ఎవలో అనుకున్నా....

Illu Illalu : Aaku pacchani Chelu Song Lyrics (ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో..)

చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

రచన: సి.నారాయణ రెడ్డి

గానం: పి. సుశీల



పల్లవి :

ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లో
ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లో
అందాల మా పల్లె అల్లో నేరెళ్లో.. అందాల మా పల్లె అల్లో నేరెళ్లో
ఆ నాటి వ్రేపల్లె అల్లో నేరెళ్లో..
ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లో   

చరణం 1 : 

నీలి మబ్బుల్లోన కనిపించేవి బాలకృష్ణుని మేని నిగనిగలే
నీలి మబ్బుల్లోన కనిపించేవి బాలకృష్ణుని మేని నిగనిగలే
అల్లరిగాలిలో వినిపించేవి అల్లరిగాలిలో వినిపించేవి
పిల్లనగ్రోవి సవ్వడులే
పాల పొదుగుల ఆలమందలే..
పాల పొదుగుల ఆలమందలే.. ఊరించే తీయని కోరికలే   
ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. ఆపైన పైరగాలి అల్లో నేరెళ్లో 

చరణం 2 :

తీయ మామిళ్ల తొలకరి పూతలు
తెలుగు కన్నియల తొలిసిగ్గులే
తీయ మామిళ్ల తొలకరి పూతలు
తెలుగు కన్నియల తొలిసిగ్గులే
చిలిపిగ పాడే కలికి కోయిలలు
చిలిపిగ పాడే కలికి కోయిలలు.. పలికేది నెరజాణల భావాలే
ఏటితరగలా.. నీటి నురగలా ఏటితరగలా
నీటి నురగలా.. మెరిసేవి పరువాల చిరునవ్వులే      
ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లో
అందాల మా పల్లె అల్లో నేరెళ్లో.. అందాల మా పల్లె అల్లో నేరెళ్లో
ఆనాటి వ్రేపల్లె అల్లో నేరెళ్లో
ఒహూహూ…. ఒహూహూ….. ఒహూహూహూహూ..
ఒహూహూహూహూ.. ఒహూహూహూహూ 

Illu Illalu : Haayiga Mathugaa Song Lyrics (హాయిగా మత్తుగా ఆడవే..)

చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

రచన: ఆరుద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

హాయిగా మత్తుగా ఆడవే.. అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా
హాయిగా మత్తుగా ఆడవే.. అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా
హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా… భామా  

చరణం 1 : 

మధువులు చిలికించే మైకం పొంగుతుంది నీలో
మైకం తట్టుకొనే మగసిరి పొగరుంది నాలో
మధువులు చిలికించే మైకం పొంగుతుంది నీలో
మైకం తట్టుకొనే మగసిరి పొగరుంది నాలో
కైపులు పెంచుకుందాం.. లే.. లే.. లే..
సుఖములు పంచుకుందాం..  రా..  రా..  రా
అందాలు నీవి అనుభవం నాది..  ఆనందం.. ఇదే.. ఇదే  
హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా… భామా 

చరణం 2 :

కొత్తగ మురిపించు.. పాతను మరపించు ముద్దుగా 
ఘుమఘుమలాడించు.. కోరిక పండించు వెచ్చగా
కొత్తగ మురిపించు.. పాతను మరపించు ముద్దుగా 
ఘుమఘుమలాడించు.. కోరిక పండించు వెచ్చగా
రేపు నువ్వెక్కడో ఏమోలే.. రేపు నేనెవ్వరో..  ఏమోలే
ఈ రోజు మోజు ఈ రేయి హాయి.. ఇద్దరికీ చాలు.. చాలు       
హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా
హాయిగా.. మత్తుగా.. ఆడవే అందాల భామా… భామా 

Illu Illalu : Ille Ilale Swargamani Song Lyrics (ఇల్లే ఇలలో స్వర్గమనీ )

చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

రచన: అప్పలాచార్య

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



పల్లవి :

ఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీ
ఋజువు చేశావూ..  నీవు ఋజువు చేశావు 
మనసే మనిషికి అందమనీ మగడే శ్రీమతి దైవమనీ
ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు

చరణం 1 : 

మైకమనే చీకటిలో మమత కోసమై వెదికాను
మైకమనే చీకటిలో మమత కోసమై వెదికాను
కాంతి కిరణమై కనిపించీ.. జీవన జ్యోతిని వెలిగించావు
అందముగా అందానికి ఒక బంధముగా
అందముగా అందానికి ఒక బంధముగా
తొలినోముల ఫలమై దొరికావు.. నను వీడని నీడై నిలిచావు   

ఇల్లే ఇలలో స్వర్గమనీ.. ఇల్లాలే ఇంటికి దేవతనీ
ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు 
 
చరణం 2 :

చల్లని కన్నులలో వెలిగే వెన్నెల దీపాలూ
నా చిరునవ్వుకు ప్రాణాలు..  మన ప్రేమకు ప్రతిరూపాలూ
నీ పెదవుల రాగములో విరిసే తీయని భావాలు
ఆనందానికి దీవెనలు.. మన అనుబంధానికి హారతులూ  
మనసే మనిషికి అందమనీ.. మగడే శ్రీమతి దైవమనీ
ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు 

చరణం 3 :

నాలో సగమై నీవే జగమై.. నేనే నీవుగ మారావు..
నాలో సగమై నీవే జగమై.. నేనే నీవుగ మారావు
మారని మనిషిని మార్చావు..  బ్రతుకే పండుగ చేశావు
పెన్నిధివై అనురాగానికి సన్నిధివై..
కనులముందు వెలిశావు..నా కలలకు రూపం ఇచ్చావు     
ఇల్లే ఇలలో స్వర్గమనీ.. ఇల్లాలే ఇంటికి దేవతనీ
ఋజువు చేశావూ..  నీవు ఋజువు చేశావు
అహహ హాహాహాహా.. అహహ హాహాహాహా.. 
లలలలాలలలా.. లలలలాలలలా

Illu Illalu : Palletooru Mana Bhagyaseemara Song Lyrics (పల్లెటూరు మన భాగ్యసీమరా.. )

చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

రచన: కొసరాజు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



పల్లవి :

పల్లెటూరు మన భాగ్యసీమరా..
పాడి పంటలకు లోటు లేదురా
పల్లెటూరు మన భాగ్యసీమరా..
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం మనిషి మనిషిలో కనబడురా  
                
పల్లెటూరు మన భాగ్యసీమరా..
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం మనిషి మనిషిలో కనబడురా          
పల్లెటూరు మన భాగ్యసీమరా..
పాడి పంటలకు లోటు లేదురా 

చరణం 1 : 

కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు
కొల్లగ ప్రవేశపెడదాము.. కొల్లగ ప్రవేశపెడదాము
బీటినేలలను పాటుకుతెచ్చి
సుక్షేత్రాలను చేద్దాము.. సుక్షేత్రాలను చేద్దాము
కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు కొల్లగ ప్రవేశపెడదాము
బీటినేలలను పాటుకుతెచ్చి సుక్షేత్రాలను చేద్దాము 
చదివినామనే బింకం వదిలి
ఆడామగ చేదోడుగ కదిలి.. బంగారము పండిద్దాము
ఓహోహోయ్..ఓహోహోయ్..
ఓహోహోయ్.. పదిమందిని పోషిద్దాము
ఓహోహోయ్.. ఓహోహోయ్.. ఓహోహోయ్
పల్లెటూరు మన భాగ్యసీమరా..
పాడి పంటలకు లోటు లేదురా
 
చరణం 2 :

జీవనదులు కృష్ణా.. గోదావరి.. తుంగభద్రలే వున్నవి
జీవనదులు కృష్ణా.. గోదావరి.. తుంగభద్రలే వున్నవి
పంటనిచ్చు హంసా.. మసూరి.. వరి వంగడాలు వస్తున్నవి
పంటనిచ్చు హంసా.. మసూరి.. వరి వంగడాలు వస్తున్నవి
జీవనదులు కృష్ణా..  గోదావరి తుంగభద్రలే వున్నవి
పంటనిచ్చు హంసా.. మసూరి.. వరి వంగడాలు వస్తున్నవి
కరువుని దూరం చేద్దాము జాతికి ప్రాణం పోద్దాము
ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరుకీర్తులను నిలబెడదాము
ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరుకీర్తులను నిలబెడదాము     
పల్లెటూరు మన భాగ్యసీమరా..  పాడి పంటలకు లోటు లేదురా

చరణం 3 :

సోమరితనముగ తిరిగేవాళ్లే
సంఘానికి విద్రోహులురా.. సంఘానికి విద్రోహులురా
ఐకమత్యముగ యువకులందరూ
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా.. ఒళ్లు వంచి పనిచెయ్యాలిరా
సోమరితనముగ తిరిగేవాళ్లే సంఘానికి విద్రోహులురా
ఐకమత్యముగ యువకులందరూ ఒళ్లువంచి పనిచెయ్యాలిరా
ఉద్యోగంలో.. వ్యాపారంలో తృప్తియన్నదే వుండదురా
స్వతంత్రమగు మన రైతు వృత్తిలో గౌరవమున్నదిరా..
ఎంతో గౌరవమున్నదిరా   
                 
పల్లెటూరు మన భాగ్యసీమరా..
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం మనిషి మనిషిలో కనబడురా      
    
పల్లెటూరు మన భాగ్యసీమరా..
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం మనిషి మనిషిలో కనబడురా          
పల్లెటూరు మన భాగ్యసీమరా..
పాడి పంటలకు లోటు లేదురా