చిత్రం: జాబిలమ్మపెళ్లి (1996)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
M:పలుకు పలుకు చిలకలా కులుకు లొలుకు కిలకిల.. పలుకు పలుకు చిలకలా కులుకు లొలుకు కిలకిల గారాల కోయిలలా వరాల స్వరాల రాగాల ఊయలలా ఊగేటి క్షణాల చిరునవ్వులో చిందనీ వెన్నెల పలుకు పలుకు చిలకలా కులుకు లొలుకు కిలకిల పలుకు పలుకు చిలకలా కులుకు లొలుకు కిలకిల M: చిదిమిన పాలుగారు చిట్టి పొట్టి పాపగారు చిందాడే సందట్లో ఆ...ఆ...ఆ... చుక్కలన్నీ వాకిట్లో వచ్చి వాలునమ్మా లెక్కలేని దీపాలు పెట్టునమ్మా సిరులకు పుట్టినిల్లు నిలువని పసిపదాలు పారాడే నట్టింట్లో నిలబడి పోతుంది నిత్య సంక్రాంతి కొలువై ఉంటుంది చిరశాంతి పాడు కళ్ళు దిష్టి నీ జాడ చూడరాదని కన్నుల్లో పాపల్లే దాచేదా... నా గుండెలో నువ్వు గువ్వల్లే ఉండమ్మా ఏనాడు ఏకీడు నీ వంక రాదమ్మా నా ప్రాణమే ఉంచనీ కాపలా
పలుకు పలుకు చిలకలా కులుకు లొలుకు కిలకిల పలుకు పలుకు చిలకలా కులుకు లొలుకు కిలకిల F: మనసున మంటదాచి చలువల కాంతి పంచు జాబిల్లే నా తల్లీ దేవతంటి ఆ తల్లి గర్భగుడిలోన జీవితాన్ని వరంగా అందుకున్నా కంటిముందు లేని నన్ను వెంట ఉండి కాచుకుంది దీవించే ఆ లాలీ ఆ... ఆ... ఆ... కలతలు ఏనాడూ నన్ను చేరకుండా కొలువుంది ఆ ప్రేమా ఎక్కడున్నా ఎన్ని జన్మలెత్తినా తీర్చలేని ఋణములా పదిలంగా దాచింది ఎదలోనా నీ ముద్దు మురిపాలు తీయంగా తీరేలా ఆనాటి రూపముతో ఒళ్ళోకి చేరేలా అర్పించనా ప్రాణమే పూజలా పలుకు పలుకు చిలకలా కులుకు లొలుకు కిలకిల M: పలుకు పలుకు చిలకలా కులుకు లొలుకు కిలకిల గారాల కోయిలలా వరాల స్వరాల రాగాల ఊయలలా ఊగేటి క్షణాల చిరునవ్వులో చిందనీ వెన్నెల