చిత్రం : జైలర్ (2023)
సంగీతం : అనిరుధ్ రవిచందర్
గీత రచయిత : భాస్కరభట్ల
నేపధ్య గానం : సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ రవిచందర్
హుకుమ్ టైగర్ కా హుకుమ్
అతడు: ఉరుముకి మెరుపుకి పుట్టాడురా పిడుగుని పిడికిట పట్టాడురా అడుగడుగున గుడి కట్టాలిరా తరతర తరముల సూపర్ స్టారురా మనిషిని మనిషిగ చూస్తాడురా మనసుకి మనసుని ఇస్తాడురా గడబిడ జరిగితే లేస్తాడురా మొరిగిన మెడలకి ఉరితాడురా కోరస్: తలైవా నవ్వేస్తే… స్టైల్ తలైవా చిటికేస్తే… స్టైల్ తల ఎగరేస్తుంటే… స్టైల్ వయసుకి దొరకని ఇతనొక బాలుడు తలైవా వాకింగే స్టైల్ తలైవా వార్నింగే స్టైల్ తలపడు డేరింగే స్టైల్ ఎముకలు విరవక ఎవడిని వదలడు అతడు: రేయ్ లేదు ఖాతరా వేస్తాడు ఉప్పు పాతరా రేయ్ పట్టుకోకురా పేలే మందుపాతరా హే, జైలే వీడికున్న ఇల్లే అస్సలు నిదరపోవు కళ్ళే నకరాల్ చెయ్యమాకు సాలే కడతడు డొక్కచించి డోలే కోరస్: హుకుమ్ టైగర్ కా హుకుమ్ ఉరుముకి మెరుపుకీ పిడుగుని పిడికిటా, హహహ
చరణం 1:
అతడు: నువు మంచిగుంటె మంచి, ఏయ్ నువు చెడ్డగుంటె చెడ్డ నీకేది ఇష్టమైతే, ఏయ్ అది తేల్చుకోర బిడ్డా మట్ట గిడసలా ఎగరకు కొడకా, ఏయ్ పొట్టు తీసి పులుసెడతా కన్నుగప్పుతు పారిపోతే ఎలక, ఏయ్ తప్పదంటే కొండ తవ్వుతా కోరస్: తలైవా అడుగుగేస్తే… స్టైల్ తలైవా విజిలేస్తే… స్టైల్ తల తల డ్రెస్సేస్తే… స్టైల్ అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు తలైవా డాన్సింగే… స్టైల్ తలైవా స్మోకింగే… స్టైల్ తల నెరిసిన గాని… స్టైల్ చెరగని చరితలో నిలిచిన ఒక్కడు అతడు: రేయ్ లేదు ఖాతరా వేస్తాడు ఉప్పు పాతరా రేయ్ పట్టుకోకురా పేలే మందుపాతరా అతడు: హే, జైలే వీడికున్న ఇల్లే అస్సలు నిదరపోవు కళ్ళే నకరాల్ చెయ్యమాకు సాలే కడతడు డొక్కచించి డోలే అతడు: ఉరుముకి మెరుపుకీ పిడుగుని పిడికిటా ఉరుముకి మెరుపుకీ పిడుగుని పిడికిటా, (హుకుమ్) టైగర్ కా హుకుమ్ (అర్థమైందా రాజ..!)