Jaithrayathra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jaithrayathra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2023, సోమవారం

Jaithrayathra : Ennallamma Ennellamma Song Lyrics (ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి)

చిత్రం : జైత్రయాత్ర(1991)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి: ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా.... వేదన తీరాలమ్మా.... ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా....వేదన తీరాలమ్మా..... ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా..... ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా..... ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా..... ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా...... చరణం:1 బడిలో మీకిక చదువే లోకం బలపం పట్టే వేళ గురువే దైవం పెరిగే ఈడున న్యాయం నేరం కలలే కన్నీళైతే బతుకే భారం నేర్చిన అర్థాలన్నీ మారిపోయేను పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను ఆకలిల శోకాలు ఈ కుల్లు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టేను చేతులు కలపండిరా......సైనికులై లెండిరా..... ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా.....వేదన తీరాలమ్మా...... చరణం:2 కదిలే కాలమై గమనం సాగి ఎదలో ధ్యేయం కోసం సమరం రేగి రగిలే గాయమై పొగిలే ప్రాణం పగిలే గేయం తానై మిగిలే గానం కన్నోళ్ల కన్నుల్లోన వెన్నెలే పంచి ఇన్నాళ్ళ చీకట్లకు చెల్లు రాయించి కష్టాలు లేనట్టి కన్నీళ్లు రానట్టి పూలదారుల్లోకి సాగిపోదాము నేర్పుగా నడవండిరా......మార్పును కోరండిరా.... ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా......వేదన తీరాలమ్మా..... ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా...... ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా.......