Janani Janmabhoomi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Janani Janmabhoomi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మే 2025, ఆదివారం

Janani Janmabhoomi : Ghallu Ghalluna Song Lyrics (ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు మ్రోయ)

చిత్రం : జననీ జన్మభూమి (1984)

సంగీతం : కె.వి. మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల



పల్లవి:

ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు మ్రోయ
కలహంసల నడకల కలికీ..ఈ..ఈ ఎక్కడికే..ఏ..ఏ
జటలోన గంగను ధరియించి ఉన్నట్టి
జగమూ..లేలే సాంబ శివునీ..ఈ..ఈ..సన్నిధికే..ఏ..ఏ..ఏ
కలికీ ఎక్కడికే..
శివునీ..ఈ..ఈ సన్నిధికే..ఏ..ఏ..ఏ..

చరణం 1:

కంటి చూపు చెలుములంట..కాలు పెడితే కలుములంట..
చీరపెడితేనేమో..సిగ్గులంట..హ..హ
చీర కడితే చాలునంట..సిరులంటా మా యింట
చిగురాకు పాదాల కలికీ..ఈ..ఈ.. ఎక్కడికే..
ఆ..యింట..నూరేళ్ళ పేరంట మాడంగా..శ్రీశైలవాస
నీ చరణా..ఆ..ఆ సన్నిధికే....ఏ..ఏ
కలికీ..ఈ..ఎక్కడికే..
సాంబ శివునీ సన్నిధికే..ఏ..ఏ..ఏ..

చరణం 2:

వీనుల నీ పదములంట.. నేను నీ శ్రీపదములంట..
బ్రతుకు నిండా నీ పసుపు కుంకుమేనంట..మూ..ఊ..ఊ
నీవి కాటుక కన్నులంట..తేలిపొయే కలల వెంట..
శ్రీశైలావాసా నీ శరణా ఆ ఆ సన్నిధికే..ఏ..ఏ..
శృంగారా మంధార మకరంద మానంద భ్రమరాంభిక దేవి
పాదా..ఆ..ఆ..ఆ.. సన్నిధికే..ఏ..ఏ..ఏ
ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు మ్రోయ
కలహంసల నడకల కలకీ..మూ..హు..హూ..హు..హూ
నీ చరణా...ఆ..ఆ..ఆ సన్నిధికే..ఏ..ఏ..ఏ
కలికీ..ఈ..ఈ..ఈ..ఈ ఎక్కడికే..
నీ చరణ సన్నిధికే..ఏ..ఏ..ఏ

Janani Janmabhoomi : Paluku Thenela Thalli Song Lyrics (పలుకుతేనేల తల్లి )

చిత్రం : జననీ జన్మభూమి (1984)

సంగీతం : కె.వి. మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , యస్.పి..శైలజ



పల్లవి:

మూ..ఊ..ఊ..ఊ..ఊ..ఊ
పలుకుతేనేల తల్లి పవళించవమ్మా..ఆ..ఆ
పలుకుతేనేల తల్లి పవళించవమ్మా
కలికితనమున విధుల అలసితివి గాన
కలికితనమున విధుల అలసితివి గాన
లాలి..శుభలాలీ..లా..ఆ..లి శుభలా..ఆ..లి

చరణం 1:

చిన్ననాటి నీ లాలి నన్ను నిదరపుచ్చగా...ఆ..ఆ..అ
ఈనాటి నీ లాలి మేలుకొలుపు కాగా..ఆ..ఆ.
చిన్న నాటి నీ లాలి నన్ను నిదరపుచ్చగా
ఈనాటి నీ లాలి మేలుకొలుపు కాగా..ఆ
అమ్మగా దీవించి కమ్మగా నిదరపో..ఓ..ఓ..
అమ్మగా దీవించి కమ్మగా నిదరపో..ఓ..ఓ..
నీవు నేర్పిన లాలే..నీకు నేను పాడగా...లా
లాలీ..శుభలాలీ..
లా..ఆ..ఆ..ఆ లీ..ముహూ..ఊ..ఊ

Janani Janmabhoomi : Tadisina Andaalalo Song Lyrics (తడిసిన అందాలలో...)

చిత్రం : జననీ జన్మభూమి (1984)

సంగీతం : కె.వి. మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి :

ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తడిసిన అందాలలో...
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తనువుల ఉయ్యాలలో...
నవ్వనీ యవ్వనం... ఈ క్షణం...
ఆ... ఆ.. ఆ.. ఆ
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తడిసిన అందాలలో...
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తనువుల ఉయ్యాలలో...
నవ్వనీ యవ్వనం... ఈ క్షణం...
ఆ... ఆ.. ఆ.. ఆ
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తడిసిన అందాలలో... తనువుల ఉయ్యాలలో...

చరణం 1 :

చిదిమిన ముద్దు చిగురాకు తాంబూలం... ఆ.. ఆ.. ఆ..
పెదవులమీదా నునులేత సింగారం... ఆ.. ఆ.. ఆ..
ఓహో.. అలలను అడుగు నాలోని వయ్యారం... ఆ.. ఆ..
అనువుగ ఇచ్చే కౌగిళ్ళ సల్లాపం... ఆ.. ఆ.. ఆ..

పరువమన్నది కెరటం... ఆడుతున్నది భరతం
చేసుకో నీ సొంతం... పాడుకో నీ సరసం...
ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ..
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తడిసిన అందాలలో... తనువుల ఉయ్యాలలో...

చరణం 2 :

నునుపుల ఒళ్లు నూగారు ముత్యాలు... ఆ... ఆ.. ఆ..
నీరెండ తాకి వెలిగేను దీపాలు... ఆ.. ఆ.. ఆ..
చెక్కిలి మీదా చేస్తుంటే చేవ్రాలు... ఆ..హ.. హా..
చక్కిలిగింతకు పూసేను రోజాలు... ఊ..ఊ..ఊ...
కంటి చూపుల కలహం... కరిగిపోయిన విరహం
పెదవి ఎరుగని దాహం... ప్రేమకే దాసోహం
లలలలలల..లా..
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తడిసిన అందాలలో... తనువుల ఉయ్యాలలో...

Janani Janmabhoomi : Thuule Thuule Thuulenamma Song Lyrics (తూలే తూలే తూలేనమ్మ)

చిత్రం : జననీ జన్మభూమి (1984)

సంగీతం : కె.వి. మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల



పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆ..
తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ
తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..


చరణం 1 :

నడిచి నడిచి రావయ్య నందీవాహనా..
అలసిసొలసి పోకయ్య అందెల బసవన్న
నడిచి నడిచి రావయ్య నందీవాహనా..
అలసిసొలసి పోకయ్య అందెల బసవన్న
నడయాడే ఆ గంగ బిడియాన పిలవంగ
నడయాడే ఆ గంగ బిడియాన పిలవంగ
వారణాసి నదులు నీ కాళ్ళు కడగంగ

నందీవాహనా... హా..హా.. గౌరీమోహనా
నందీవాహనా...   గౌరీమోహనా
తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ 


చరణం 2 :

పొడిచే వంక కొమ్ముల్లో వంక జాబిల్లి...
వంక పెట్టి తలకెక్కే నెలవంకే తుళ్లి
పొడిచే వంక కొమ్ముల్లో వంక జాబిల్లి...
వంక పెట్టి తలకెక్కే నెలవంకే తుళ్లి
అది చూసి ఆ గంగ శివమెత్తి ఆడంగా
అది చూసి ఆ గంగ శివమెత్తి ఆడంగా
కాశీ విశాలాక్షి కండ్లే కలువాలవ్వంగా 

నందీవాహనా... హా..హా.. గౌరీమోహనా
నందీవాహనా... గౌరీమోహనా
తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ 
ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ..ఆ ఆ. ఆ.ఆ..ఆ.. ఆ..ఆ