చిత్రం: జయ సింహ (1955)
రచన: సముద్రాల వెంకట రామానుజాచార్యులు
గానం: ఘంటసాల, పి. లీల
సంగీతం: టి.వి.రాజు
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. నీ ఊహతోనే పులకించి పోయే ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. నీ ఊహతోనే పులకించి పోయే ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. నీ కోసమే ఈ అడియాశలన్ని నా ధ్యాస నా ఆశ నీవే సఖా ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. మనియేములే ఇక విరితావిలీల మన ప్రేమ కెదురేది లేదే సఖి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. ఊగేములే తుల తూగేములే ఇక తొలి ప్రేమ భోగాలా.. ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే ఇక తొలి ప్రేమ భోగాలా.. మురిపాలతేలే మన జీవితాలు మురిపాలతేలే మన జీవితాలు దరహాస లీలావిలాసాలులే.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ.. ఈనాటి ఈ హాయి..