Jeevana Ragam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jeevana Ragam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఆగస్టు 2021, ఆదివారం

Jeevana Ragam : Oka Kommaku Song Lyrics (ఒక కొమ్మకు పూచిన పువ్వులం)

చిత్రం: జీవనరాగం (1986)

సంగీతం: సత్యం

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


పల్లవి: ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము ఓ చెల్లెమ్మా... నీతోటిదే లోకము ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే అన్నయ్యా... నీవేను నా ప్రాణము ఓ అన్నయ్యా... నీతోటిదే లోకము చరణం:1 మా చెల్లి నవ్వు సిరిమల్లె పువ్వు పలికించే నాలో రాగాల వీణ మా అన్న చూపు మేఘాల మెరుపు కురిపించె నాలో పన్నీటి వాన ఇది కరగని చెరగని కలగా ఎద నిలిచెనులే కలకాలం చిరునవ్వుల వెన్నెల సిరిగా చిగురించునులే చిరకాలం ఈ బంధం సాగేను ఏనాటికీ ఆ దైవం దీవించు ముమ్మాటికీ చరణం:2 మా ఇంటి పంట చిన్నారి చెల్లి నా కంటి పాప బంగారు తల్లి ఈ చోట ఉన్నా ఏ చోట ఉన్నా ఎదలోన నిన్నే కొలిచేను అన్నా మమకారం మనకే సొంతం విడరానిది ఈ అనుబంధం ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ ఈ బంధం సాగేను ఏనాటికీ ఆ దైవం దీవించు ముమ్మాటికీ ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము అన్నయ్యా... నీతోటిదే లోకము