Jodi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jodi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మార్చి 2024, ఆదివారం

Jodi : Verri Manasa Song Lyrics (వెర్రి మనసా వేగిపోకే)

చిత్రం: జోడి (1999)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్



పల్లవి :

వెర్రి మనసా వేగిపోకే విరహమంటే వెండి మంటే నీ తోవకదె వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గాయం కాంతుల్లో కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు వెర్రి మనసా వేగిపోకే

చరణం : 1

మాయదారి మంచు మంట ఆరిపోక కోరుకున్న మల్లె బాట కంటపడక కలలు ఎండిపోవాలా ఏ..వెన్నలంటె తెలియదు వేడి లేక రాతిరంటె వేగు చుక్క పైడి బాట ఆశ ఓడిపోదు అలలకి అలసట రాదు విలవిలపించే ఈడుకి జతవై చలువలు పంచే తొలివలపేమో ఒళ్ళో చేరుకుంటే ఓటమే ఓడదా వెర్రి మనసా వేగిపోకే... విరహమంటే వెండి మంటే నీ తోవకదె వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గాయం కాంతుల్లో కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు......

చరణం : 2

సులువుగ దొరకవు ఏ పెన్నిధులు గనులను తవ్వక అందవు మణులు గమ్యం మనకు ఎదురై రాదుగా కురవక నిలవదు నింగి మేఘం చినుకుతొ చెదరద మన్ను మౌనం నేనై పాడుతున్నా నిన్నే వేడుతున్నా మనసును మీటే మాటే విన్నా నిలవని అడుగుల బరువవుతున్నా నూరేళ్ళ వరకు నీ తోడయ్యేందుకు వెర్రి మనసా వేగిపోకే.. నీ తోవకదె వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గాయం కాంతుల్లో కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు వెర్రి మనసా వేగిపోకే....

Jodi : Nanu Preminchananu Song Lyrics (నను ప్రేమించానను మాట)

చిత్రం: జోడి (1999)

రచన: భువనచంద్ర

గానం: శ్రీని, సుజాత

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్



పల్లవి:

నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా… నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా… పూవుల యదలో శబ్దం… మన మనసులు చేసే యుద్ధం ఇక ఓపదె నా హృదయం… ఓపదే నా హృదయం సత్యమసత్యము పక్కపక్కనే…. ఉంటయ్ పక్కపక్కనే చూపుకి రెండు ఒక్కటే… బొమ్మాబొరుసులు పక్కపక్కనే… చూసే కళ్లు ఒక్కటే అయినా రెండూ వేరేలే… నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా…

చరణం 1:

రేయిని మలిచి… ఈ ఈ ఆ ఆ… రేయిని మలిచి… కనుపాపలుగా చేసావో… కనుపాపలుగా చేసావో… చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో… ఓ ఓ మెరిసే చుక్కల్ని తెచ్చి… వేలి గోళ్లుగ మలిచి మెరుపుల తీగను తెచ్చి… పాపిటగా మలిచావో వేసవిగాలులు పీల్చి… వికసించే పువ్వులు తెచ్చి మంచి గంధాలెన్నో పూసి… మేను మలిచావో అయినా మగువ… మనసుని శిలగా చేసినావే వలచే మగువ… మనసుని శిలగా చేసినావే నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా…

చరణం 2:

వయసుని తడిమి నిదురలేపింది నీవేగా… నిదురలేపింది నీవేగా వలపు మధురిమలు తెలిపింది నీవేగా… ఓఓ… గాలి నేల నింగి… ప్రేమ ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు… ఓ ప్రేమ నీవేగా గంగై పొంగె మనసు… కవితల్ని పాడుతు ఉంటే తుంటరి జలపాతంలా… కమ్ముకున్నది నీవేగా అయినా ప్రియుడా… మనసుకి మాత్రం దూరమైనావే కరుణే లేక… మనసుని మాత్రం వీడిపోయావే నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా… నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా… పూవుల యదలో శబ్దం… మన మనసులు చేసే యుద్ధం ఇక ఓపదు నా హృదయం… ఓపదు నా హృదయం

4, జూన్ 2021, శుక్రవారం

Jodi : Kadile kaalame Jeevitham Song Lyrics (కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం)

చిత్రం : జోడి (1999)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : భువనచంద్ర 
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి 


కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం

రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి.. కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి.. కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ... లాలాలాలాలాలా...లాలాలాలాలాలా... లాలాలాలాలాలా... చరణం :1 కవితలనే మాటలుగా కన్నులతో రాసాను... మాటల్లో నింపుకున్నవి నా ప్రాణాలాయ్య... మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచాను చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా... ప్రియుడా నీ ఉహలతో కరిగే పొతున్నా వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా... కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చరణం : 2 చెలియ నీ అందియనై, పాదాలను ముద్దిడనా మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా... నా కాలి అందియవో, నాలోని ఊపిరి వో ప్రియుడా నువ్వు సుగంధము ఐతే.. వసంతమై పోనా... జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచి ఇయ్యవా... లాలాలాలాలాలా...లాలాలాలాలాలా... కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం లాలాలాలాలాలా...లాలాలాలాలాలా... రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి.. కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా