KA లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
KA లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, నవంబర్ 2024, శుక్రవారం

KA : Bujjaama Song Lyrics (ఓ బుజ్జమ్మాయి,)

చిత్రం : (2024)

సంగీతం : సామ్ సి ఎస్.

రచన : సనాపతి భరద్వాజ పాత్రుడు

గానం: శరత్ సంతోష్




పల్లవి :- కనులకు కానుకలా కనబడినావే, కొడవలి చూపులతో కలబడినావే... కలవగ నీవే, కలవరమాయే, కలకలమాయే... ఓ బుజ్జమ్మాయి, ఓ బుల్లమ్మాయి నీ రెండు కళ్ళు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తు బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయి ఏ గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టుబొట్టు మీద ఒట్టు మనసు నీదే నెరజాణ, అందుకోవే నజరానా నవ్వు పిట్ట నా మోము వాకిట వాలింది నీ వలనే భామా, భామా !! సత్యభామా సత్యభామా సొగసే సుతారమా! సత్యభామా సత్యభామా నడకే నిదానమా! సత్యభామా సత్యభామా పలుకే ప్రశాంతమా!! అందాల సత్యభామా , భామా అంతా నీ మహిమ.. చరణం :- వంపుసొంపులింపుగున్న వయ్యారి, చెంప లోని కెంపులున్న చింగారి , దిష్టి చుక్క పెట్టుకోవే సింగారి, సింగారీ ... ముద్దు ముద్దు మాటలాడు చిన్నారి, ముచ్చటైన రూపు నీది పొన్నారి, ముగ్గు లోకి దించి నన్ను ముంచావే కావేరి ... కాపలాగా కాచుకున్నా కాలాన్ని కొల్లగొట్టు మాయలాడివమ్మా... చూపు రువ్వి, చిచ్చు రేపే చందమామవమ్మా... ఓ మిస్సమ్మాయి* కస్సు బుస్సమ్మాయి నీ రెండు కళ్ళు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తు మిస్సమ్మాయి కస్సు బుస్సమ్మాయి ఏ గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టుబొట్టు మీద ఒట్టు మనసు నీదే నెరజాణ, అందుకోవే నజరానా నవ్వు పిట్ట నా మోము వాకిట వాలింది నీ వలనే భామా, భామా !! సత్యభామా సత్యభామా సొగసే సుతారమా! సత్యభామా సత్యభామా నడకే నిదానమా! సత్యభామా , సత్యభామా నన్నే వరించుమా...