చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, ,పి. సుశీల
సంగీతం: మాస్టర్ వేణు
ఆఆఆ....తందనాననాననన్నా... .. తానేనెతన్నననన్నే.ఓ..తనానెనన్ననన్నా..... తారారిరో... ముద్దబంతి పూలుబెట్టి మొగిలిరేకులు జడను జుట్టి జడను జుట్టి హంసలా నడచి వచ్చే చిట్టెమ్మ... చిట్టెమ్మా... మా ఇంటికేమి తెచ్చావమ్మ చెప్పమ్మా.. చెప్పమ్మా...|ము| అద్దమంటి మనసు ఉంది అందమైన వయసుఉంది వయసు ఉంది ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా.. కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా.. చెప్పయ్యా..|అద్ద| పుట్టింటి అరణాలు... ఘనమైన కట్నాలు...|| అత్తవారింటనిండ వేచిన అవి అభిమానమంత విలువ జేతునా|| | ముద్ద| అభిమానమాభరణం మర్యాదే భూషణం|| గుణము మంచిదైతే చాలయా.. మన గొప్పతనము జెప్పుకోనువీలయా..|| |అద్ద| కాలుచేయిలోపమనీ... కొక్కిరాయిరూపమనీ...|| వదినెలు నన్ను గేలిజేతురా పిల్లనుదెచ్చి పెళ్ళి జేతురా|| ఎవరేమిఅన్ననేమి ఎగతాళి చెయ్యనేమి|| నవ్విననాపచేనె పండదా... నలుగురుమెచ్చురోజు ఉండదా...|| |అద్ద|