Kalasina Manasulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kalasina Manasulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2022, గురువారం

Kalasina Manasulu : Okka Kshanam song

చిత్రం: కలిసిన మనసులు (1968)

సంగీతం: మాస్టర్ వేణు (మద్దూరి వేణుగోపాల్) రచన: దేవులపల్లి. కృష్ణ శాస్త్రి గాయకులు: సుశీల, ఘంటసాల ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలకరించకు నావైపిటు చూడకు ఒక్క క్షణం ఒక్క క్షణం నిన్ను తలుచుకోనీ నా కన్ను మూసుకోనీ మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం ఆ రెప్పలు వాల్చకు అటు ఇటు కదలకు ఒక్క క్షణం ఒక్క క్షణం ఆ కన్నులలో ఊహల అర్ధమేదొ అడగనీ ఆ కొలనులలో నీడలా అదే పనిగ చూడనీ మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం ఆకులతో గాలి ఊసులాడకూడదు ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు మేను మేను తాకగా మౌనముగా గువ్వలవలే కొమ్మ పైని మాటాడక కునుకు జంట పువ్వులవలే మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం మోము పైన ముంగురులు ముసరవచ్చునా? మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా? వాగులాగా ఈ సమయం సాగిపోవుననే భయం నాలో నిండిన నీవే నాకు చాలు నేటికి మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం