Kalyana Mantapam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kalyana Mantapam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2025, శనివారం

Kalyana Mantapam : Chukkalu Paade Subha Mantram Song Lyrics (చుక్కలు పాడే.. శుభ మంత్రం)

చిత్రం: కళ్యాణ మంటపం (1971)

సంగీతం: ఆదినారాయణరావు

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: పి. సుశీల



పల్లవి :
చుక్కలు పాడే.. శుభ మంత్రం
దిక్కులు నిండే దివ్య మంత్రం
ఎక్కడనో.. ఎపుడో.. ఎవరో పలికిన వేద మంత్రం
ఇక్కడనే.. ఇపుడే.. ఎవరో..
నా చెవిలో ఊదిన మంత్రం.. మధు మంత్రం
చుక్కలు పాడే.. శుభ మంత్రం చరణం 1 :
రెక్కలపై ఆ గువ్వల జంట ... రేకులలో ఆ పువ్వుల జంట
రెక్కలపై ఆ గువ్వల జంట... రేకులలో ఆ పువ్వుల జంట
సాగుచునే.. ఊగుచునే.. మధుర మధురముగ మక్కువగా..
చదువుకునే ఆనంద మంత్రం చుక్కలు పాడే శుభ మంత్రం చరణం 2 : కన్నులు ఒక పరి మూసుకొని.. నీవన్నది మరి మరి తలచుకొని
కన్నులు ఒక పరి మూసుకొని.. నీవన్నది మరి మరి తలచుకొని
ఒక్కతినే.. నే నొక్కతినే..
అదే పనిగనే సదా మనసులో ఆలపించే ప్రియ మంత్రం చుక్కలు పాడే శుభ మంత్రం చరణం 3 :
కోవెల దైవం పిలిచే దాకా.. ఆవలి ఒడ్డున నిలిచే దాకా
కోవెల దైవం పిలిచే దాకా.. ఆవలి ఒడ్డున నిలిచే దాకా
నాలోనే లోలోనే.. నాతి చరామి.. నాతి చరామి..
అన్న ఆ ప్రాణ మంత్రం చుక్కలు పాడే శుభ మంత్రం దిక్కులు నిండే దివ్య మంత్రం
ఎక్కడనో.. ఎపుడో.. ఎవరో పలికిన వేద మంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో..
నా చెవిలో ఊదిన మంత్రం మధు మంత్రం
చుక్కలు పాడే శుభ మంత్రం

Kalyana Mantapam : Piliche Vaarunte Song Lyrics (పిలిచే వారుంటే.. )

చిత్రం: కళ్యాణ మంటపం (1971)

సంగీతం: ఆదినారాయణరావు

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల



పల్లవి :
పిలిచే వారుంటే.. పలికేను నేను
పిలిచే వారుంటే.. పలికేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేను నేను
కనుపాప అద్దాన కదిలేను నేను.. ఆ....ఆ.....ఆ.... పలికేవారుంటే.. పిలిచేను నేను
పలికేవారుంటే.. పిలిచేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే
కనుపాప అద్దాన కదిలేది నీవే ఆ....ఆ.....ఆ.... చరణం 1 :
ఏ నాటిదో ఈ బంధము.. మన అనుబంధము.. ఆ...ఆ... ఆ...
ఏ నాటిదో ఈ బంధము.. మన అనుబంధము
కలకాలము నిలవాలిలే.. మన అనురాగము
గోదారిలా నేడు ఉరికేను మనసు.. నీ పిలుపు వినగానే.. పులకించె బ్రతుకు పులకించె బ్రతుకు
పిలిచే వారుంటే.. పలికేను నేను హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే
కనుపాప అద్దాన కదిలేది నీవే ఆ....ఆ.....ఆ.... చరణం 2 : నీ రూపమే నా దైవమై నను మురిపించెలే ఆ....ఆ..ఆ..
నీ రూపమే నా దైవమై నను మురిపించెలే
నా అందమే అరవిందమై నిను పూజించెలే
నీ మనసులో నాకు చోటుంటే చాలు
నా బ్రతుకులో విరియు నవనందనాలు.. నవనందనాలు పలికేవారుంటే.. పిలిచేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేను నేను...
కనుపాప అద్దాన కదిలేను నేను
ఆ....ఆ......ఆ...... చరణం 3 : కలగన్నదే నిజమైనది చెలి ఔనన్నది
సొగసున్నదీ... గుణమున్నదీ చెలి నాదైనది అడుగుల్లో అడుగేసి నడవాలి మనము
మన మొకటి కాగానే మారాలి జగము
అడుగుల్లో అడుగేసి నడవాలి మనము
మన మొకటి కాగానే మారాలి జగము మన మొకటి కాగానే మారాలి జగము
మారాలి జగము.. మారాలి జగము.. మారాలి జగము

Kalyana Mantapam : Krishnaa..Naa Mora Vinava Song Lyrics (కృష్ణా.... నా మొర వినవా)

చిత్రం: కళ్యాణ మంటపం (1971)

సంగీతం: ఆదినారాయణరావు

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: పి. సుశీల




పల్లవి : 

కృష్ణా.... నా మొర వినవా నను దయగనవా..
కన్నె బ్రతుకు కాపాడరావా..
ఈ ఘోరబలి ఆపించలేవా... ఆపించలేవా..
నా మొర వినవా.. నను దయగనవా
దీనులబ్రోచే దైవము కావా..
ఏనాడైనా వరమడిగితినా
ఈ వరమైనా ఈయగలేవా....  కృష్ణయ్యా కరుణించవయ్యా

చరణం 1 :

ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా
ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా
ఓటమి కలిగే ఆశలు తొలగే..ఈ ఘోరానికె తలవంచె
జగమింతేనా... బ్రతుకింతేనా..
నా మొర వినవా నను దయగనవా

చరణం 2 :

మగువను లోకం బానిస చేయగ... మౌనం పూనావా..
తాళికి తరుణిని దూరం చేయగ.. జాలే మరిచావా..
న్యాయం విడిచావా..ఘోరం తలిచావా..
వినవేలా... శిలవేనా... రావేలా... కృష్ణా

Kalyana Mantapam : Sarigama Padanisa Song Lyrics (సరిగమ పదనిసానిదప)

చిత్రం: కళ్యాణ మంటపం (1971)

సంగీతం: ఆదినారాయణరావు

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: పి. సుశీల



పల్లవి : 

సరిగమ పదనిసానిదప మగరిస...  అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై...  ఎదురై
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై...  ఎదురై
పలికే వారుంటే...
సరిగమ పదని సానిదప మగరిసని

చరణం 1 :

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమవిధాత... జీవననేత ప్రేమవిధాత
అను గుడిగంట విను ప్రతి జంట
సరిగమ పదని సానిదప మగరిసని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే

చరణం 2 :

తీగా తీగా పెనగీ పెనగీ
రాగ ధారగా సాగీ సాగీ
తీగా తీగా పెనగీ పెనగీ
రాగ ధారగా సాగీ సాగీ
జీవన గంగావాహిని కాదా
జీవన గంగావాహిని కాదా
అను ప్రతి జంట విను గుడిగంట
సరిగమ పదని సానిదప మగరిసని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై ... ఎదురై
పలికే వారుంటే...
సరిగమ పదని సానిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే