Kannavaari Kalalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kannavaari Kalalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, జనవరి 2025, శనివారం

Kannavaari Kalalu : Okanaati maata Song Lyrics (ఒకనాటి మాట కాదు.)

చిత్రం: కన్నవారి కలలు (1974)

గీత రచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  రామకృష్ణ, పి.సుశీల

సంగీతం :  వి. కుమార్


పల్లవి:

ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...
ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...
తొలినాటి ప్రేమదీపం.. కలనైన ఆరిపోదు...
తొలినాటి ప్రేమదీపం..కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు..

చరణం 1:

ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో ...
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో....
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో...
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో...

పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ ...
గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ...
కలసిన కౌగిలిలో ...కాలమే ఆగినదీ....
ఒకనాటి మాట కాదు ...ఒక నాడు తీరిపోదు...

చరణం 2:

చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా..
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ...
ఆహా..చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా...
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ...
ఆ....కొంటెగా నిన్నేదో కోరాలనివుంది...
ఆ....తనువే నీదైతే దాచేదేముంది ...
మనసులవీణియపై ...బ్రతుకే మ్రోగిందీ...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు...
తొలినాటి ప్రేమదీపం... కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు...


Kannavaari Kalalu : Andalu Kanuvindu Chestunte Song Lyrics (అందాలు కనువిందు చేస్తుంటే..)

చిత్రం: కన్నవారి కలలు (1974)

గీత రచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  రామకృష్ణ

సంగీతం :  వి. కుమార్


పల్లవి :

అందాలు  కనువిందు చేస్తుంటే..
ఈ అందాలు  కనువిందు చేస్తుంటే..
ఎదలోన పులకింత రాదా..
చూసే కనులకు నోరుంటే..
మధురగీతమే పాడదా.. మధురగీతమే పాడదా                                                   
అందాలు  కనువిందు చేస్తుంటే..
ఎదలోన పులకింత రాదా

చరణం 1 :

చల్లగాలుల పల్లకీలలో నల్ల మబ్బులూరేగెనూ..
అంబరాన ఆ సంబరాలుగని గిరులబారులు మురిసెనూ
పలుకు రాని ప్రకృతి  నాకు పలికె స్వాగతాలు..
నిండుగా కలలు పండగా.. నాదు డెందమే నిండగా                                     
అందాలు  కనువిందు చేస్తుంటే..
ఎదలోన పులకింత రాదా

చరణం 2 :

ఎవరి కురులలో నలుపు చూసి
తుమ్మెదలు  చిన్నబోయెనూ
ఎవరి బుగ్గల ఎరుపు చూసి చెంగలువ సిగ్గు చెందేనూ
అవే సోయెగాల కురులూ.. అవే మిసిమి బుగ్గలూ
చిలిపిగ మనసు చెదరగా..
కనుల కెదురుగా వెలిసెనూ                            
అందాలు  కనువిందు చేస్తుంటే..
ఎదలోన పులకింత రాదా

చరణం 3 :

ఈ సరస్సులో ఇంద్ర ధనుస్సులో.. 
వింత సొగసు ఏముంది
ఓర చూపుల సోగకనులలో కోటి సొగసుల గని వుంది
చెలియ పాలనవ్వులోన మరులు జల్లు వాన కురిసెనే .. 
వలపు విరిసెనే..
తలపు చిందులే వేసెనే       
                           
అందాలు  కనువిందు చేస్తుంటే..
ఎదలోన పులకింత రాదా
చూసే కనులకు నోరుంటే..
మధురగీతమే పాడదా...
మధురగీతమే పాడదా       


Kannavaari Kalalu : Babu.. Chinnari babu Song Lyrics (బాబూ.. చిన్నారి బాబూ.. )

చిత్రం: కన్నవారి కలలు (1974)

గీత రచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  పి.సుశీల

సంగీతం :  వి. కుమార్


పల్లవి :

బాబూ..  చిన్నారి బాబూ.. 
బాబూ...  చిన్నారి బాబూ
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను..
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను . .
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను..
బాబూ చిన్నారి బాబూ

చరణం 1 :

మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న..
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా. . .
మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న..
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా
అతడు లేని నా బ్రతుకే చీకటిరా.. 
ఆ చీకటిలో నీ నవ్వే దీపికరా 
బాబూ...  చిన్నారి బాబూ

చరణం 2 :

అమ్మా అని ఒక్కసారి నువ్వంటే.. 
నా అణువణువున ఆనంద గోదావరి . .
అమ్మా అని ఒక్కసారి నువ్వంటే..
నా అణువణువున ఆనంద గోదావరి
నాన్నేడని ముందు ముందు అడిగితే.. 
నా గుండెల్లో కన్నీటి కావేరి 
బాబూ...  చిన్నారి బాబూ

చరణం 3 :

నెలవంకలా నీవు పెరగాలి.. నా కలలన్నీ నీ కళలై వెలగాలి . . .
నెలవంకలా నీవు పెరగాలి.. నా కలలన్నీ నీ కళలై వెలగాలి
ఆ వెలుగే నా కంటి వెలుగు కావాలి.. 
అది చూసి మీ నాన్న మురిసి పోవాలి.. 
బాబూ...  చిన్నారి బాబూ        
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను..
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను . .
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను..
బాబూ చిన్నారి బాబూ 





Kannavaari Kalalu : Cheli Choopulona Song Lyrics (చెలి చూపులోన కథలెన్నో తోచే.. )

చిత్రం: కన్నవారి కలలు (1974)

గీత రచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం :  వి. కుమార్


పల్లవి :

చెలి చూపులోన కథలెన్నో తోచే..
చలి గాలిలోన పరువాలు వీచే . . .
చెలి చూపులోన కథలెన్నో తోచే..
చలి గాలిలోన పరువాలు వీచే

చరణం 1 :

నీ సొగసు పిలిచింది నా వయసు పలికింది.. 
నడిరేయి సై అంది.. మౌనమిక చాలంది
నీ సొగసు పిలిచింది నా వయసు పలికింది.. 
నడిరేయి సై అంది.. మౌనమిక చాలంది
ఈ జగమమతా కొత్తగవుంది.. 
ఈ క్షణమేదో మత్తుగవుంది... పొంగేనులే యౌవ్వనం               
చెలి చూపులోన కథలెన్నో తోచే..
చలి గాలిలోన పరువాలు వీచే 

చరణం 2 :

జడివాన పడుతున్నా ఏమిటో ఈ దాహం.. 
ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం
జడివాన పడుతున్నా ఏమిటో ఈ దాహం.. 
ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం
ఆరని జ్వాలలే మనసున రేగే.. 
తీరని కోరికలే చెలరేగే.. కలిగేనులే పరవశం                
చెలి చూపులోన కథలెన్నో తోచే..
చలి గాలిలోన పరువాలు వీచే





Kannavaari Kalalu : Sorry so sorry..Song Lyrics (నా మాట విను ఇంకోకసారి)

చిత్రం: కన్నవారి కలలు (1974)

గీత రచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  రామకృష్ణ, పి.సుశీల

సంగీతం :  వి. కుమార్


పల్లవి : 

sorry so sorry... నా మాట విను ఇంకోకసారి
sorry so sorry... నా మాట విను ఇంకోకసారి 
ప్రేమించలేదు నిన్ను... ఈ బ్రహ్మచారి
పెళ్ళాడితే నిన్ను... నా దారే గోదారి 
sorry so sorry... నా మాట విను ఇంకోకసారి
చూడు.. ఇటు చూడు..
నా వంక చూసి మాటాడు...
చూడు.. ఇటు చూడు..
నా వంక చూసి మాటాడు...
ప్రేమించలేదా నువ్వు.. నన్నే ఏరికోరి
కాదంటే వదలను నిన్ను... ఓ బ్రహ్మచారి 
sorry so sorry... నా మాట విను ఇంకోకసారి 

చరణం 1 : 

నిన్న కాక అటు మొన్ననె కాదా... కళ్ళు కళ్ళు కలిపేవు..
అవునూ.. 
వెన్నలాంటి నా మనసును దోచి... బాసలెన్నో  చేశావు...
అవునూ.. 
నిన్న కాక అటు మొన్ననె కాదా... కళ్ళు కళ్ళు కలిపేవు
వెన్నలాంటి నా మనసును దోచి... బాసలెన్నో  చేశావు
ఆశపెంచి మురిపించిన నువ్వే... మనిషి మారిపోయావు 
తప్పు తెలుసుకొన్నాను... మనసు మార్చుకొన్నాను
నా తప్పు తెలుసుకొన్నాను... మనసు మార్చుకొన్నాను
కాబోయే శ్రీమతి ఇలా.. ఉండ కూడదనుకొన్నాను 
sorry so sorry... నా మాట విను ఇంకోకసారి 

చరణం 2: 

తిండిపోతులా తింటే కాదు... వండే చిన్నది కావాలి...
ఊ..హు..హు...హు... 
ఏడుపు అంటే నాకు గిట్టదు... ఎపుడూ నవ్వుతు వుండాలీ..
అలాగా.. 
తిండిపోతులా తింటే కాదు... వండే చిన్నది కావాలి
ఏడుపు అంటే నాకు గిట్టదు... ఎపుడూ నవ్వుతు వుండాలీ
చీటికి మాటికి అలగకూడదు... తోడూ నీడగ వుండాలి 
వంట నేర్చుకొంటాను... రియల్లీ..
నవ్వులు చిందిస్తాను... ప్రామిస్ ... 
వంట నేర్చుకోంటాను... నవ్వులు చిందిస్తాను
నీతోటే నేనుంటాను... నీమాటే వింటాను 
అయితే ఇక రేపే మ్రోగేను పెళ్ళి సన్నాయి
ఎల్లుండే నీ చేతుల్లో ఉంటుంది పాపాయి
జో...హాయీ హాయీ జో హయీ...హాయీ జో...