చిత్రం. : కన్నె వయసు (1973)
సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్యులు
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నీ రూపమే దివ్యదీపమై నీ నవ్వులే నవ్యతారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే - 2 కాలి అందియలు ఘల్లుఘల్లుమన - 2 రాజహంసలా రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే -2 పదము పదములో మధువులూరగా -2 కావ్యకన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో