చిత్రం: కేటు డూప్లికేట్ (1995)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
సంగీతం: కోటి
ఓ..ఓ..ఓ..ఓ............. ఓ..ఓ..ఓ...ఓ............ ఓ..ఓ....ఓ..ఓ...ఓ...... ఒ..ఓ..ఓ..ఓ..ఓ......... నీ కోసం ప్రతీక్షణం నిలువెల్లా నిరీక్షణం రగులుతున్న హృదయంలో.ఓ.ఓ ప్రణయం నీకే అంకితం నిను చూడని నా కనుపాపాలలో కొలువుండదు ఏ ఉదయం.. నీ కోసం ప్రతీక్షణం నిలువెల్లా నిరీక్షణం ఈ పాట మీకు అందించిన వారు ఎదను మీటిన కమ్మని రాగము కలగ మారినదా.. ఎదట ఉందని నమ్మిన స్వర్గము కరిగి పోయినదా...... ముడులువేసిన మరుని దీవెన ముగిసి పోదు కద.... శత జన్మలకూ జత వీడని నీ స్మృతి నీడని నా పయణం.. నీ కోసం ప్రతీక్షణం నిలువెల్లా నిరీక్షణం రగుగులుతున్న హృదయంలో.ఓ.ఓ ప్రణయం నీకే అంకితం నిను చూడని నా కనుపాపాలలో కొలువుండదు ఏ ఉదయం.. రుణము తీరిన తియ్యని స్నేహము మరపురాదు కదా.. అలల మాదిరి తీరని దాహము అలసిపోదు కదా.. చినుకు చేరని నడి ఎడారిని. నడక ఎంత హృదా. తడి ఆరని నీ ఎద కోనలలో. చిగురించద వలపు వనం. నీ కోసం ప్రతీక్షణం నిలువెల్లా నిరీక్షణం రగుగులుతున్న హృదయంలో.ఓ.ఓ ప్రణయం నీకే అంకితం నిను చూడని నా కనుపాపాలలో కొలువుండదు ఏ ఉదయం.. ఓ..ఓ..ఓ..ఓ............. ఓ..ఓ..ఓ...ఓ............ ఓ..ఓ....ఓ..ఓ...ఓ...... ఒ..ఓ..ఓ..ఓ..ఓ.........