Khaidi Gaaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Khaidi Gaaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2024, సోమవారం

Khaidi Gaaru : Vinnapalu Chesukona Song Lyrics (విన్నపాలు చేసుకోనా )

చిత్రం: ఖైదీగారు (1998)

రచన:

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



విన్నపాలు చేసుకోనా యిల్లాలికి సన్నజాజులిచ్చుకోనా బుగ్గచుక్క పెట్టుకోనా యీ రాతిరి సిగ్గుపాలు పంచుకోనా కాలమే కౌగిలై ఆగిపోనీ అహో స్వర్గమే గుండెలో దాగిపోనీ అహో పరువంపు వంపు మురిపాల తొలకరిలో ఏడాదిలో నా యింటిలో పండువంటి బాబే నీకు కలుగుతాడుగా ఉంగ ఉంగ సంగీతాలే మనకు తోడుగా చెలీ, గారాబాలవేళ నువ్వే చంటిపాపవే ఇక వందయేళ్ళదాకా మీరే కంటిపాపలే పుణ్యమేదో చేసినాను పూజచేసి పొందినాను గతజన్మలన్ని శతకోటి ముడుపులుగా ఏ కోరికా నే కోరను, నీడలాగ మీతో వుండే బ్రతుకు చాలును తల్లిప్రేమ నీతో నాకు నేడు తెలిసెను మరీ అంతమాట అంటే నేను తట్టుకోనుగా నిను గుండెగూటిలోన దాచుకుంటి మేనుగా శ్వాస నీవే మేను నాది ఇంక నాకు లేనిదేది ఎడబాటు లేదు మరియేడు జన్మలకి