Kokilamma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kokilamma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జూన్ 2022, శనివారం

Kokilamma : Pallavinchava naa gonthulo Song Lyrics (పల్లవించావా నా గొంతులో)

చిత్రం : కోకిలమ్మ(1983)

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

గీత రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాధ


పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవెనాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవెనాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో