Kotha Jeevithalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kotha Jeevithalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2024, శుక్రవారం

Kotha Jeevithalu : Pongi Porale Andalenno song lyrics (పొంగి పొరలే ...అందాలెన్నో పొంగి పొరలే...)

చిత్రం: కొత్త జీవితాలు (1981)

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

సంగీతం: ఇళయ రాజా



పొంగి పొరలే ...అందాలెన్నో పొంగి పొరలే... కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే... కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే... కోనల్లోనా.. లోయల్లోనా నేల పైన నింగి కదలే... వన్నెకాడు నన్ను కలిసే... పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా పవనాలే జిల్లనగా...హృదయాలే ఝల్లనగా పొంగి పొరలే అందాలెన్నో ..పొంగి పొరలే కోనల్లోనా... లోయల్లోనా...నేల పైన నింగి కదలే వన్నెకాడు నిన్ను కలిసే.... కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా మ్రోగిందీ.. రాగం..మ్రోగిందీ.. రాగం.. ఆడిందీ తాళం...అది నీ కోసం...హా.హా.హా కన్నెమదిలో అందాలెన్నో..పొంగి పొరలే.. కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదిలే... వన్నెకాడు నన్ను కలిసే పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా కన్నుల్లో... మౌనం ...కన్నుల్లో... మౌనం... నవ్వుల్లో గానం..అది నా కోసం...హా.హా.హా.. పొంగి పొరలే అందాలెన్నో..పొంగి పొరలే కోనల్లోనా.. లోయల్లోనా..నేల పైన నింగి కదలే వన్నెకాడు నిన్ను కలిసే.

Kotha Jeevithalu : Tham Thananam song lyrics (తననం...తననం.)

చిత్రం: కొత్త జీవితాలు (1981)

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల, ఎస్.జానకి

సంగీతం: ఇళయ రాజా



తననం...తననం...తననం...తననం..త... ఆ....ఆ....ఆ...ఆ...ఆ...ఆ...ఆ..ఆ.. తం...తననం..తననం...తననం...తననం... తం తన నంతన తాళంలో రస రాగంలో మృదునాదంలో.. నవ జీవన భావన పలికెనులే తం తన నంతన తాళంలో రస రాగంలో మృదునాదంలో.. నవ జీవన భావన పలికెనులే నవ భావనయే సుమ మోహనమై ఆపై వలపై పిలుపై కళలొలుకగ తం తన నంతన తాళంలో రస రాగంలో.. మృదునాదంలో.. నవ జీవన భావన పలికెనులే తనన తని నననని నననని తనన ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే మది దోచెనులే.. మరు మల్లెలు సైగలు చేసెనులే ఆ....ఆ...ఆ...ఆ... ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే మది దోచెనులే.. మరు మల్లెలు సైగలు చేసెనులే కన్నియ ఊహలు వెన్నెలలై కదలే కదలే విరి ఊయలలై పున్నమి వేసిన ముగ్గులలో కన్నులు దాచిన సిగ్గులలో తేనెలకందని తీయని కోరికలే చిరు మరులను చిలుకగ తం తన నంతన తాళంలో రస రాగంలో మృదునాదంలో.. నవ జీవన భావన పలికెనులే ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ.. పొంచిన మదనుడు పువ్వుల బాణం నాటెనులే ఎద మీటెనులే పులకింతలు హద్దులు దాటెనులే ఆ...ఆ...ఆ...ఆ...ఆ... పొంచిన మదనుడు పువ్వుల బాణం నాటెనులే ఎద మీటెనులే పులకింతలు హద్దులు దాటెనులే మ్రోగెను పరువం రాగిణియై మురిసే మురిసే చెలి మోహినియై వన్నెల చుక్కల పందిరిలో వెన్నెల రాయని కౌగిలిలో ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే మధుమధురిమలోలుకగ తం తన నంతన తాళంలో రస రాగంలో మృదునాదంలో.. నవ జీవన భావన పలికెనులే నవ భావనయే సుమమోహనమై ఆపై వలపై పిలుపై కళలొలుకగ... తం తన నంతన తాళంలో రస రాగంలో మృదునాదంలో.. నవ జీవన భావన పలికెనులే తం తననం తననం తననం తననం తననం