Kousalya Krishnamurthy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kousalya Krishnamurthy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Kousalya Krishnamurthy : Raakasi Gadusu Pilla Lyrics (రాకాసి గడుసు పిల్ల)

చిత్రం: కౌసల్య కృష్ణమూర్తి (2020)

రచన: రాంబాబు గోసాల

గానం: అనన్య నాయర్, రాహుల్ సిప్లిగంజ్, రోషిత

సంగీతం: ధిబు నినాన్ థామస్



పల్లవి :

జింగ్ జింగాక జిన్ జింగ్ జింగాక జిన్ జింగ్ జింగాక జిన్ జిన్ రాకాసి గడుసు పిల్ల శివకాశి సరికి పిల్ల ఎవరిదీ… ఎవరిదీ… అల్లరి చేష్టల అమ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తోంది ఎవరిదదీ… ఎవరిదదీ… ఆహా… మా ఇంటి దేవత మందార పూలత ఊరంత నీ జత రెండు జళ్ల చిన్ని సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కన్గున్న చిట్టి చిలక ఉఉ ఉఊ యాయి ఏ ఉఉ ఉఊ యాయి ఏ పెంకి పిల్లవే కొంటె పిల్లవే అమ్మ పోలికే వచ్చినాదిలే పొట్టి పిల్లవే గట్టి పిల్లవే నాన్న కూచి లా పుట్టినావు లే హే నాన్న కన్నా కల నిజమైఎలా

చరణం 1 :  నీకున్న ఇష్టమే తీరేలా కన్నవా కలబడి ఈ ఆట నెర్చైవ వెనకడుగు వేయని వ్యూహంలా బరిలోకి నువ్వే దూకాల చిన్నమ్మా నిలబడి నీ చురుకు చుపైవ బుల్లి పిట్ట బుజ్జి పిట్ట పసి పాల పిట్ట చిరునవ్వులిట్ట కురిసే పూలబుట్ట పైడిగుట్ట బుట్ట తేనపట్ట వెండి వెన్నెలింట మేఘమల్లే నువ్వు మెరిసే మా ఇంటి దేవత తన్నా నాన్న తన్నాన నాన్న. మందార పూలత ఆహా… నన నన నన నన నాన్నా నాన్నా నన నన నన నన నా అల్లిబిల్లి జాబిలి నువ్వమ్మ జాజి మల్లి కొమ్మకు చెల్లెమ చుర చుర చూడగా సూర్యుడే పరుగమ్మా జింగు జింగాక జిన్ జింగు జింగాక జిన్ జింగు జింగాక జిన్ జింగు జింక చరణం 2:  కొండపల్లి బొమ్మే కౌసమ్మ పల్లె గుండె సవ్వడి నువ్వమ్మ పూడమికే రంగులె నీ లేత నవ్వులమ్మ ఆహా… బుల్లి బుగ్గలున్న తల్లి చిన్న పాలవెల్లి ఇంద్రధనస్సు మల్లె విరిసే పల్లె పైర గాలి కేళి చందనాల హొలీ చల్లగుండమంటూ నిన్ను దీవెనల్లో ముంచే రాకాసి గడుసు పిల్ల శివకాసి సరికి పిల్ల ఎవరిదీ… ఎవరిదీ… అల్లరి చేష్టల అమ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిదీ… ఎవరిదీ… మా ఇంటి దేవత మందర పూలత ఊరంతా నీ జత రెండు జళ్ల చిన్ని సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కన్గున్న చిట్టి చిలక

Kousalya Krishnamurthy : Muddabanthi Song Lyrics (ముద్దబంతి పువ్వు)

చిత్రం: కౌసల్య కృష్ణమూర్తి (2020)

రచన: కృష్ణకాంత్

గానం: యాజిన్ నజీర్

సంగీతం: ధిబు నినాన్ థామస్




పల్లవి :

ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా… ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా… నేటికి నేడు, మారిన ఈడు… చేసె నేరమే నిద్దుర లేదు, ఆకలి లేదు… అన్ని దూరమే చక్కదనాల చుక్కకివాళ… దిష్టి తీసి హారతియ్యనా అమ్మడివే… ఏ ఏ స ద ని స… ద ని స మ గ మ గ స ద ని స గ గ స ద ప గ స గ గ స ని ద ని స…

చరణం 1 : 

కలలను దాచే నా కన్ను నీవే… నిజమై పోవే నావన్ని నీవే పగలే మెరిసే మిణుగురువే… నగలే వెలిసే వెలుగు నువ్వే ఇలపై నడిచే మెరుపు నువ్వే… హా..! ఇకపై వరమై దొరుకు నువే నీడ కూడా చీకట్లో… నిన్నొదిలి పోతుందే నేనెపుడూ నీ వెంటే ఉంటా… ముద్దాబంతి పువ్వు… ఇలా పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా

చరణం 2: 

పరుగులు తీసే నా రాణి నీవే… పడితే మెత్తని నేలౌతాలే ఎపుడూ నిలిచే భుజమౌతా… కలను కంటే నిజమౌతా కష్టం వస్తే కలబడతా… హా..! కడదాకా నే నిలబడతా అలిసొస్తే జో కొడతా… గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా… ముద్దాబంతి పువ్వు… ఇలా పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్..! మౌనంగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గరయ్యేటి దారి చూపవే… ఆపసోపాలే నావిక ఆపే… ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే…ఏ  అమ్మడివే… ఏ తందానానే నా…