చిత్రం : క్షత్రియుడు (1990)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం: కె.యస్.చిత్ర
పల్లవి: పాటగా నాలో మధురాలు విరిసే మల్లెలీ వేళా పరువాలు పరిచే దేహం అదిరెనూ..ఓ..ఓ..మోహం విరిసెనూ ప్రాయం మాటులో..ఓ..ఓ..మౌనం వెలిసెను హృదయమే పిలిచేనే..చిగురాశలే పలికేనే పాటగా నాలో మధురాలు విరిసే చరణం 1: వలపే తేనె నవ్వులజల్లై యదలో కురిసే తలపే కోటి చిందులేసి అలలై మెరిసే వగలే కొసరి రాగమాలా కదిలే వింత పాటలే కోరే చిలిపి బాసలోనా చిలికే లేత ధ్యాసలే హృదయమే పిలిచేనే..చిగురాశలే పలికేనే పాటగా నాలో మధురాలు విరిసే మల్లెలీ వేళా పరువాలు పరిచే చరణం 2: వయసే నేడు ఇంద్రధనుస్సై కధలే పెంచే మనసే గుండెలోన వేయి కలలే పెంచే కనులే నాకు జోలపాడే ఇది ఏ రాజయోగమే ఖసిగా మనసు ఆలపించే ఉరికే రాగబంధమో హృదయమే పిలిచేనే..చిగురాశలే పలికేనే పాటగా నాలో మధురాలు విరిసే మల్లెలీ వేళా పరువాలు పరిచే దేహం అదిరెనూ..ఓ..ఓ..మోహం విరిసెనూ ప్రాయం మాటులో..ఓ..ఓ..మౌనం వెలిసెను హృదయమే పిలిచేనే..చిగురాశలే పలికేనే పాటగా నాలో మధురాలు విరిసే మల్లెలీ వేళా పరువాలు పరిచే