చిత్రం: కుల గోత్రాలు (1962)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
పల్లవి : చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా చరణం 1: నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ అహహా ...అహా ఒహోహో .... అహహా ఒహో ......అ ఆ చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా చరణం 2: నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే అహహా ... అహా ఒహోహో ..... అహహా ఒహో.......అ ఆ ... చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా చరణం 3: నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ అహహా...అహా ఒహోహో.... హహా ఒహో...అ ఆ . . చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా