Kurukshetram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kurukshetram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జనవరి 2022, గురువారం

Kurukshetram : Mrogindi Kalyana Veena Song Lyrics (మ్రోగింది కళ్యాణ)

చిత్రం: కురుక్షేత్రం (1977)

సంగీతం: సాలూరి.రాజేశ్వర రావు

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


F:ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా.. M:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. M:మ్రోగింది కళ్యాణ వీణ.. M:నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ.. M:మ్రోగింది కళ్యాణ వీణ.. F:ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. F:నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ.. F:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. F:మ్రోగింది కళ్యాణ వీణ.. చరణం 1: M:పిల్ల గాలితో నేనందించిన పిలుపులే విన్నావో..ఓ..ఓ.. M:నీలి మబ్బుపై నే లిఖియించిన లేఖలందుకున్నావో.. F:ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా F:ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా F:కల వరించి.. కలవరించి F:కల వరించి.. కలవరించి.. పులకిత తనులత నిను చేరుకోగా..ఆ..ఆ.. F:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. F:మ్రోగింది కళ్యాణ వీణ.. చరణం 2: F:మత్త కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా..ఆ.. F:మయూరాంగనలు ఆట వెలదులై.. లయ లహరులపై ఆడగా.. M:నా యోగమే ఫలియించగా.. F:ఆ దైవమే కరుణించగా.. M:నా యోగమే ఫలియించగా.. F:ఆ దైవమే కరుణించగా.. M:సుమసరుడే పురోహితుడై.. సుమసరుడే పురోహితుడై.. F:శుభ ముహూర్తమే నిర్ణయించగా..ఆ..ఆ.. F:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. M+F:మ్రోగింది కళ్యాణ వీణ.. M+F:నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ.. M+F:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. M+F:మ్రోగింది కళ్యాణ వీణ..