Life is Beautiful లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Life is Beautiful లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, నవంబర్ 2022, మంగళవారం

Life Is Beautiful : Emunde Navve Song Lyrics (ఏముందో నవ్వే కన్నుల్లో..)

చిత్రం: లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ (2012)

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: వనమాలి

గానం: కార్తీక్




Beautiful smile.. beautiful face Beautiful eyes.. you're nothing but grace Beautiful you.. I look amazed what is your name.. what is your name ఏముందో నవ్వే కన్నుల్లో.. ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే ఒంపుల్లో.. ఏముందో ఈ అమ్మాయిల్లో ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటే... Beautiful smile.. beautiful face Beautiful eyes.. you're nothing but grace ఏముందో నవ్వే కన్నుల్లో.. ఏముందో ఈ అమ్మాయిల్లో ఎదనే కొరికే చూపందం.. అలకే అందం మనసే తెలిపే మాటందం ప్రతీది అందం.. జగమే కననీ అందం తన జతలో చెలిమే ఆనందం ఏముందో నవ్వే కన్నుల్లో.. ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే ఒంపుల్లో.. ఏముందో ఈ అమ్మాయిల్లో మెరుపై కదిలే మేనందం.. నడకే అందం నలిగే నడుమే ఓ అందం.. పలుకే అందం మగువే అందం కాదా మది తనకే వశమైపోదా ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే తప్పేదైనా జరిగే వీలుందే.. నీ..వెన్నంటే.. ఉంటే

Life is Beautiful : Atu Itu Ooguthu SongLyrics (అటు ఇటు ఊగుతూ )

చిత్రం: లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ (2012)

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: శ్రీరామచంద్ర



అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ తలపుని తరుముతోంది వయసుకేమయింది నీ వలనే ఇదిలా మొదలయిందే నా మాటే వినదే... ప్రేమా... ఏ నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా... ఏ నా వెంటే ఉంటావు..నీలా మారే వరకు  అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది జాబిలికి జలుబును తెచ్చే చలువ నీవే సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే కాలముని కలలతో నింపే కథవి నీవే మౌనం నీ భాషయితే చిరునవ్వే కవితౌతుందే నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే నీ వలనే ఇదిలా ఔతోందే నా మాటే వినదే... ప్రేమా... ఏ నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా... ఏ నా వెంటే ఉంటావు..నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది మాములుగా అనిపిస్తుందే నువ్వు వస్తే మాయమని తెలిసొస్తుందే లోతు చూస్తే మంటవలె వెలుగిస్తావే దూరముంటే మంచువలె లాలిస్తావే చేరువైతే విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అందం నువ్వు పూస్తే నూరేళ్లూ విరిసేను జీవితం నీ వలనే ఇదిలా జరిగిందే  నా మాటే వినదే... ప్రేమా... ఏ నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా... ఏ నా వెంటే ఉంటావు..నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది