Madana Kamaraju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Madana Kamaraju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మార్చి 2022, శనివారం

Madana Kamaraju : Neeli megha malavo Song Lyrics (నీలి మేఘ మాలవో)

చిత్రం: మదన కామరాజు కధ (1969)

సాహిత్యం: జీ కృష్ణమూర్తి

గానం: పీ బీ శ్రీనివాస్

సంగీతం: రాజన్ నాగేంద్ర



నీలి మేఘ మాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో నీలి మేఘ మాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో నీలి మేఘ మాలవో నీ మోములోన జాబిలి దోబూచులాడెనే నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో నీలి మేఘ మాలవో నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే నీ వలపు తనివి తీరని మధురాల రావమే నిలచేవదేల నా పిలుపు ఆలకించవో నీలి మేఘ మాలవో రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే రాగాల తేలిపోదమె జాగేల చాలునే రావోయుగాల ప్రేయసి నన్నాదరించవో నీలి మేఘ మాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో