ఓ.. ప్రియా
Malle Puvvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Malle Puvvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
29, మార్చి 2022, మంగళవారం
Malle Puvvu : O Priya Song Lyrics (ఓ.. ప్రియా..)
చిత్రం : మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
ఓ.. ప్రియా..
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది..
చరణం 1:
సఖియా.. ఆ..ఆ.. నీవెంతటి వంచన చేశావు
సిరిసంపదకమ్ముడు పోయావు
నీవెంతటి వంచన చేశావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం..
ఓ.. ప్రియా..
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది..
చరణం 2:
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే..ఏ..
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే..
ఓ.. ప్రియా..
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)