Manasulo Maata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Manasulo Maata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జులై 2021, శనివారం

Manasulo Maata : Nelamedha Jabili Song Lyrics (నేలమీద జాబిలీ సరేలే)

చిత్రం : మనసులో మాట(1999)

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: 

గానం: 



నేలమీద జాబిలీ సరేలే ఊహ కాని ఊర్వశీ చూడగానే సుందరీ అదేలే మల్లెజాజి పందిరీ తోడు కోరే వయస్సు లాగ తొంగి చూసే మనస్సు లాగా ఉరికివచ్చే ఉషస్సులాగ వరములిచ్చే తపస్సులాగ సితారలా మెరిసిందీ షికారుగా కలిసిందీ

శ్రీదేవి చూపుతోనె శృంగార దీపమెట్టినట్టుగా సింధూర సంధ్యవేళ సిగ్గంత బొట్టు పెట్టినట్టుగా ఆబాల పిచ్చుక అందాలు గుచ్చగ వాలిందమ్మ గాలివాటుగా వయ్యరాల గాలి వీచగా పచ్చబొట్టు గుండెకేసి పైటచాటు చేసి చందమామ లంచమిచ్చి నూలుపోగుతీసి ఇదే తొలీ అనుభూతీ రచించనీ రసగీతీ

నేలమీద జాబిలీ సరేలే ఊహ కాని ఊర్వశీ

సంధ్యారాగం సఖి సంగీతం పాడిన వేళా రాయని గ్రంధం రాధిక అందం అంకితమై.. ఆమనీ సోకుల అమెని తాకిన అనుభవమే.. ఎదలకు లోతున పెదవుల మధ్యన సాగర మధనం ఊగ తరంగం

చెలి చూపు సోకగానే తొలిప్రేమ కన్ను కొట్టినట్టుగా లేలేత చీకటింటా నెలవంక ముద్దు పెట్టినట్టుగా చుశాక ఆమెనీ కన్నుల్లో ఆమనీ వేసిందమ్మ పూల ముగ్గులే పట్టిందమ్మ తేనే ఉగ్గులే ఆమె మూగ కళ్ళలోన సామవేదగానం ఆమె చేయి తాకగానే హాయి వాయులీనం ఒకే క్షణం మైమరచీ అనుక్షణం ఆ తలపు