Manchi Roju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Manchi Roju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జనవరి 2025, శనివారం

Manchi Roju : Cheppalanundi Song Lyrics (చెప్పాలనుంది చెప్పేదెలా...)

చిత్రం: మంచి రోజు (1977)

సంగీతం: ఎం.బి.శ్రీరాం

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: పి. బి. శ్రీనివాస్



పల్లవి:

చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?
చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?
చిలకమ్మ నువ్వైన చెప్పే...  తనకోసమే నేననీ
చెప్పాలనుంది చెప్పేదెలా...  సిగ్గెందుకో నాకిలా?

చరణం 1:

ఆ చూపు మెరుపు..ఆ మేని విరుపు.. కలనైన మరచేదెలా?
ఆ చూపు మెరుపు..ఆ మేని విరుపు.. కలనైన మరచేదెలా?
పులకించి వయసు.. పిలిచింది పిలుపు.. వినకుంటే కలిసేదెలా?
ఆ... ఆ... ఆ.. చెప్పాలనుంది చెప్పేదెలా సిగ్గెందుకో నాకిలా

చరణం 2:

అందాల కొమ్మ అపరంజి బొమ్మ...  నా చేతికందాలిగా
అందాల కొమ్మ అపరంజి బొమ్మ... నా చేతికందాలిగా
నా మూగ మనసు ఇకనైన తెలిసి... నా చెంత చేరాలిగా..
ఆ.. ఆ.. ఆ... చెప్పాలనుంది చెప్పేదెలా ... సిగ్గెందుకో నాకిలా?
చిలకమ్మ నువ్వైన చెప్పే ... తనకోసమే నేననీ
చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?

Manchi Roju : Anukunnaa Nenani Song Lyrics (అనుకున్నా నేనని... )

చిత్రం: మంచి రోజు (1977)

సంగీతం: ఎం.బి.శ్రీరాం

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఎస్.జానకి


పల్లవి :

అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని... అన్నావు నీవు నేనని
             
అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని
అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని... అన్నావు నీవు నేనని

చరణం 1 :

ఎన్నాళ్ళు హాయిగా కలుసుకొంటిమి
ఇన్నాళ్లకు మనసు మనసు తెలుసుకొంటిమి
ఎన్నాళ్ళు హాయిగా కలుసుకొంటిమి
ఇన్నాళ్లకు మనసు మనసు తెలుసుకొంటిమి
ఈనాటి బంధము ఏనాటిదో...
ఈనాటి బంధము ఏనాటిదో... ఈ ప్రేమదీవెన ఏనోటిదో       
     
అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని... అన్నావు నీవు నేనని
   
చరణం 2 :

చూపుల్లో సోయగాలు చుాసుకొంటిమి
ఎదలోని మమతలన్ని దాచుకొంటిమి
చూపుల్లో సోయగాలు చుాసుకొంటిమి
ఎదలోని మమతలన్ని దాచుకొంటిమి
ఎన్నెన్నో అనుభవాలు చూడనుంటిమి
ఎన్నెన్నో అనుభవాలు చూడనుంటిమి
ఆ మంచి రోజుకై వేచియుంటిని
         
అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని...
అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని... అన్నావు నీవు నేనని 


Manchi Roju : Nee kosamani Song Lyrics (నీకోసమని నే వేచినానే)

చిత్రం: మంచి రోజు (1977)

సంగీతం: ఎం.బి.శ్రీరాం

సాహిత్యం: దాశరథి

గానం: పి. బి. శ్రీనివాస్



పల్లవి :

నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
ఈ బిగువేలనే నా మాటవిని
మోముగని పులకించని... నీ మోముగని పులకించని

నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే   
               
చరణం 1 :

నీ కనుపాపలలో నా రూపం
ఈ  కోపము మాని నను చూడని
నీ నవ్వులు కురిసే వెన్నెలలో
మధుపానము చేసి ననుపాడని
నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే  
                     
చరణం 2 :

అనురాగసుమాలే వెదజల్లి
నీ బ్రతుకుబాటలో పయనించని
మన మనసులు రెండు ముడివేసి
బిగికౌగిలి గదిలో శయనించని 
నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
ఈ బిగువేలనే నా మాటవిని
మోముగని పులకించని... నీ మోముగని పులకించని


Manchi Roju : Chilipi kannula Chinnadana Song Lyrics (చిలిపికనుల చిన్నదానా)

చిత్రం: మంచి రోజు (1977)

సంగీతం: ఎం.బి.శ్రీరాం

సాహిత్యం: దాశరథి

గానం: రామకృష్ణ, పి. సుశీల



పల్లవి :

చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
బిడియపడిన లేత వలపు... బిగువు వీడిందిలే
చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
                   
చరణం 1 :

చల్లనివేళల లోలోన దాగని తాపాలు
వెచ్చనికౌగిట ఏవేవో తియ్యని సౌఖ్యాలు
మేను మేను మేళవించి లీనమవుదాములే
చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
                 
చరణం 2 :

మధుమయ ప్రణయం మోహాల దాహం తీర్చాలి
వలపుల సంకెల కలకాల బంధము కావాలి
కమ్మనైనా సుఖములోన కరిగిపోవాలిలే 

చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
బిడియపడిన లేత వలపు... బిగువు వీడిందిలే


Manchi Roju : Kunti Song Lyrics (కుంతీ)

చిత్రం: మంచి రోజు (1977)

సంగీతం: ఎం.బి.శ్రీరాం

సాహిత్యం: కరుణ శ్రీ

గానం: ఘంటసాల



పల్లవి :

అది యొక రమణీయ పుష్పవనము... ఆ వనమందొక మేడ
మేడపై అది యొక మారుమూల గది
ఆ గది తల్పులు తీసి మెల్లగా  పదునైదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల..
జంకొదవెడు కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగాన్.. ఆ.. ఆ
ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా?
దొరలు ఆనంద బాష్పాలో...
పొరలు దుఃఖ బాష్పములో గాని యవి గుర్తుపట్టలేము
రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద!
గాలితాకున జలతారు మేలిముసుగు జారె నొక్కింత
అదిగొ.. చిన్నారి మోము పోల్చుకొన్నాములే!
కుంతిభోజపుత్రి స్నిగ్ధసుకుమారి యామె కుంతీకుమారి
ముని మంత్రమ్ము నొసంగ నేల?
ఇడెబో మున్ముందు మార్తాండు రమ్మని  నే కోరగనేల?
కోరితిని బో యాతండు రానేల? 
వచ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగానేల?
పట్టెను బో పట్టి నొసంగనేల?
యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్ 

చరణం 1 :

అయ్యో భగవానుడా! ఈ విషాదాశ్రువుల తోడ నింక నెంత  కాలమీమేను మోతు...
గంగాభవాని కలుష హారిణి యీ తల్లి కడుపులోన కలిసి పోయెద నా కన్న కడుపుతోడ
ఈ విధంగా నిశ్చయించుకొని బిడ్డను రొమ్ముల్లో అదుము కుంటూ
కుంతీకుమారి నదిలోకి దిగిపోతున్నది ….
ఇంతలో నదీ తరంగాల్లో తేలుతూ ఒక పెట్టె అక్కడికి కొట్టుకు వచ్చింది..
కుంతీకుమారి కన్నుల్లో ఆశా కిరణాలు మెరశాయి.
ఈశ్వరేఛ్ఛ ఇలా ఉన్నదని గుర్తించింది.
ఆమె ఆత్మహత్య నుంచి విరమించుకున్నది. 
అయ్యో తండ్రీ! పున్నమ చందమామ సరిపోయెడి నీ వరహాల మోము 
నేనెన్నటికైన చూతునె!
మరే దురదృష్టము గప్పికొన్న నా  కన్నుల కంత భాగ్యమును కల్గునె?
ఏయమ్మయైన యింత నీ కన్నము పెట్టి యాయువిడినప్పటి మాట గదోయి నాయనా! 

తల్లీ.. గంగాభవానీ..
బాలభానుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచు చుంటి గంగా భవాని!
వీనినేతల్లి చేతిలోనైన బెట్టి మాట మన్నింపు మమ్మ
నమస్సులమ్మ...  నమస్సులమ్మ... నమస్సులమ్మ



Manchi Roju : Talli Thandri Vundi kooda Song Lyrics (తల్లి తండ్రి వుండి కూడా)

చిత్రం: మంచి రోజు (1977)

సంగీతం: ఎం.బి.శ్రీరాం

సాహిత్యం: అప్పలాచారి

గానం: ఎస్.జానకి



పల్లవి :


తల్లి తండ్రి వుండి కూడా అనాధ బాలుడివయ్యావు
తాళి చూలు లేకుండానే తల్లిని నేనయ్యాను... నీ తల్లిని నేనయ్యాను
తల్లి తండ్రి వుండి కూడా అనాధ బాలుడివయ్యావు
తాళి చూలు లేకుండానే తల్లిని నేనయ్యాను... నీ తల్లిని నేనయ్యాను    
         
చరణం 1 :

నాన్నకోసమని వెతికి వెతికి ఇంటికి తీసుకు వచ్చావు
నాన్నకోసమని వెతికి వెతికి ఇంటికి తీసుకు వచ్చావు
నాన్నను నాన్నే కాడని చెప్పి విషమ పరిస్థితి తెచ్చావు 
 
తల్లి తండ్రి వుండి కూడా అనాధ బాలుడివయ్యావు
తాళి చూలు లేకుండానే తల్లిని నేనయ్యాను... నీ తల్లిని నేనయ్యాను  
                 
చరణం 2 :

ఆగిన తుఫాను చెలరేగింది మదిలో ప్రళయం రేపింది
ఆగిన తుఫాను చెలరేగింది మదిలో ప్రళయం రేపింది
జీవితమంటే విధి ఆడించే నాటకమేనని తెలిసింది
           
తల్లి తండ్రి వుండి కూడా అనాధ బాలుడివయ్యావు
తాళి చూలు లేకుండానే తల్లిని నేనయ్యాను... నీ తల్లిని నేనయ్యాను