Master లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Master లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2022, ఆదివారం

Master : Bavagaru Bagunnara Song Lyrics (బావున్నార బాగున్నారా... )

చిత్రం: మాస్టర్ (1997)

సాహిత్యం: చంద్రబోస్

గానం: రాజేష్, సౌమ్య

సంగీతం: దేవా




బావున్నార బాగున్నారా... భామ గారు బాగున్నారా ! ఆ బావున్నార బాగున్నారా... భామ గారు బాగున్నారా బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో... అమ్మో అమ్మమ్మమ్మో... ఆ బావున్నారా బాగున్నారా భామ గారు బాగున్నారా బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా చిన్ని ముద్దు ఇమ్మంటారా ఛి పో వద్దు పొమ్మంటారా చుమ్మా అంటు చెంతకొస్తే కొమ్మమీద కూర్చుంటారా మాట మాట పెంచేశారా మంచి చెడ్డా మానేశారా గోటితోటి పోయేదాన్ని గూటిదాకా లాగేశారా వరసలు కలిపి మరదలు ఒడికే వేంచేస్తారా మనసారా బూరెల్లాంటి బుగ్గలు రెండు బొంచేస్తాలే కడుపార ఆపై రతి మహరాజల్లే మత్తుల్లో ముంచేస్తారా అమ్మో అమ్మమ్మమ్మో... అమ్మో చిన్నమ్మమ్మో... బావున్నార బాగున్నార భామ గారు బాగున్నారా బాగున్నార బాగున్నార బావగారు బాగున్నారా పిల్లా అంటు లాలిస్తారా పెళ్ళాం పోస్ట్ ఇప్పిస్తారా లిల్లిపూల మంచం మీద పిల్లో నాకు పంచిస్తారా వేళా పాలా లేదంటారా వేలాకోళం కాదంటారా చాటుమాటు పాఠాలన్ని నోటితోటి చెప్పిస్తారా ఆలుమగలం అయిపోతాంలే అడిగిందిచ్చే సుకుమారా నోరే జారితే పరవాలేదు కాలే జారకు యువతారా జరిగే కళ్యాణం దాకా జాగారం చెయ్ మంటారా అమ్మో అమ్మమ్మమ్మో... అమ్మో చిన్నమ్మమ్మో... బావున్నార బాగున్నార భామ గారు బాగున్నారా బావున్నార బాగున్నార బావగారు బాగున్నారా ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో... అమ్మో అమ్మమ్మమ్మో...

Master : Intiloki Welcome Antu Song Lyrics (ఇంటిలోకి వెల్కమంటు )

చిత్రం: మాస్టర్ (1997)

సాహిత్యం: చంద్రబోస్

గానం: రాజేష్, సౌమ్య

సంగీతం: దేవా 



ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు అలా అలా హఠాత్తుగా అటూ ఇటూ కరంట్ పోగా నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు శిస్యురాల చారుశీల శీఘ్రమేవ రొమాన్స్ నీకు ప్రాప్తిరస్తు అక్షరాల దీక్ష బూని లవ్ లోని లెసెన్స్ నేను అలకిస్తు అందంతో పరీక్ష ఇప్పుడు అర్ధాంగి ప్రమోషనెప్పుడు ఫలితం రానున్నది పరువం ఔనన్నది ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు పోర్టికోలో లైబ్రరీలో కారిడార్లో భరించలేని తాపమాయె పుస్తకాల్లో డిక్షనరీలో బ్లాకు బోర్డులో లిఖించలేని ఆకళాయే వల్లించేయ్ వయస్సు వాచకం చెల్లించేయ్ వయ్యారి వేతనం గురువా లెటెందుకు లఘువై రా ముందుకూ ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు అలా అలా హఠాత్తుగా అటూ ఇటూ కరంట్ పోగా నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

Master : Are Thammudu Song Lyrics (తమ్ముడు అరె తమ్ముడు)

చిత్రం: మాస్టర్ (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: చిరంజీవి

సంగీతం: దేవా



తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నను అడగర చెబుతా డౌటుంటే నువు బెదరవు కదా నా మాటింటే అమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటే నీకు నిదరే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే మాస్టారూ మాస్టారూ మంచి లెక్చర్ ఇచ్చారు మాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు మెగాస్టారు థాంక్యూ... తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే చరణం : 1 వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరూ మూగసైగలైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు అమెరికాలో ఇంగ్లిష్ ప్రేమ ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ తమ్ముడు అరె తమ్ముడు పొట్టివాళ్లు పొట్టవాళ్లు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ప్రేమదేశం వెళ్లగానే మానవులుగా మిగులుతారు తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నను అడగర చెబుతా డౌటుంటే నువు బెదరవు కదా నా మాటింటే చరణం : 2 లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు అది మహాసముద్రం ఫ్రెండు సెంచరీల కొద్ది పెద్ద సీరియల్‌గా సాగుతున్న మహా నవలరా ప్యారు ఆ స్టోరీ కొట్టదు బోరు కగుడింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు అమ్మడు ఓయ్ అమ్మడు లబ్బుడబ్బు హార్ట్‌బీట్ లవ్వులవ్వు అన్నదంటే హైక్లాసు లోక్లాసు చూసుకోదు ప్రేమ కేసు తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నను అడగర చెబుతా డౌటుంటే నువు బెదరవు కదా నా మాటింటే అమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటే నీకు నిదరే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే మాస్టారూ మాస్టారూ మంచి లెక్చర్ ఇచ్చారు మాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు మెగాస్టారు

Master : Thilotthama Song Lyrics

చిత్రం: మాస్టర్ (1997)

సాహిత్యం: చంద్రబోస్

గానం: హరిహరన్,సుజాత

సంగీతం: దేవా



తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభాతమా శుభ వసంతమా నే మోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా ఏ దారిలో సాగుతున్నా యెద నీవైపుకే లాగుతోంది ఏ వేళలో యెప్పుడైనా మది నీ వూహలో వూగుతోంది పెదవే వో మధుర కవిత చదివే అడుగే నా గడపనొదిలి కదిలే ఇన్నాళ్ళు లేని యీ కొత్త బాణీ యివ్వళే మనకెవరు నేర్పారమ్మా ఈ మాయ చేసింది ప్రేమే ప్రియా! ప్రేమంటే వొకటైన మనమే కలలే నా యెదుట నిలిచె నిజమై వలపే నా వొడికి దొరికె వరమై ఏ రాహువైనా ఆషాఢమైనా యీ బాహుబంధాన్ని విడదీయునా నీ మాటలె వేదమంత్రం చెలి! నువ్వన్నదే నా ప్రపంచం