Mayani Mamatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mayani Mamatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2025, శనివారం

Mayani Mamatha : Kanulu Maataladunani Song Lyrics (కనులు మాటలాడునని)

చిత్రం: మాయని మమత (1970)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

సంగీతం: అశ్వథామ

గానం: ఘంటసాల, పి.సుశీల




పల్లవి:

కనులు మాటలాడునని.. ఈ...
మనసు పాట పాడునని.. ఈ...
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లగ విన్నాను.. అది కనుగొన్నాను ఈనాడు

చరణం 1:

మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ... ఆ.... ఆ... ఆ...ఆ... ఆ...
మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకుంటే.. ఒక అందం
మలయానిలమున చెలి ముంగురుల మబ్బులూగితే.. ఒక అందం
ఆ ముంగురులే చెలికాణి మోముపై ముసురుకుంటే.. ఒక అందం
అదే... ముద్దులొలికే అనుబంధం...
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు

చరణం 2:

వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే.. మధురానందం
ఆ కలువ చెలువ నెలరాయునిలో కరిగిపోతే.. మహదానందం
జగములనేలే చంద్రవదనతో ఎగిసిపోతే.. దివ్యానందం
ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే.. రసానందం...
అదే... యుగయుగాల అనుబంధం...







31, జనవరి 2025, శుక్రవారం

Mayani Mamatha : Raanika Nee kosam Song Lyrics (రానిక నీకోసం సఖీ... )

చిత్రం: మాయని మమత (1970)

సాహిత్యం: దేవులపల్లి

సంగీతం: అశ్వథామ

గానం: ఘంటసాల



పల్లవి :

రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం
రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం
రాలిన సుమాలు ఏరుకొని...  జాలిగ గుండెల దాచుకోని
ఈ దూరపు సీమలు చేరుకొని
రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం

చరణం 1 :

వాకిటిలో నిలబడకు... 
ఇంక నాకై మరిమరీ చూడకు ..
చూడకువాకిటిలో నిలబడకు... 
ఇంక నాకై మరిమరీ చూడకు
ప్రతి గాలి సడికి తడబడకు... 
పదధ్వనులని పొరబడకుకోయిలా కోయలే…
గూడు గుబులై పోయేలే….
రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం

చరణం 2 :

పగలంతా నా మదిలో మమతలు
సెగలై లో లో రగులునులే
నిద్రరాని నిశినైనా నాకు నిష్టుర వేదన తప్పదులే
పోనీలే… ఇంతేలే.. గూడు గుబులై పోయేలే ..
రానిక నీకోసం సఖీ...
రాదిక వసంత మాసం…రాదిక వసంత మాసం