Merupu Kalalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Merupu Kalalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మే 2022, శుక్రవారం

Merupu Kalalu : O Vana Padithe Song Lyrics (ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి )

చిత్రం: మెరుపు కలలు(1997)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: సుజాత


ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి  ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి  కోయిలకే కుక్కూక్కు ఎదహోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి  నదిలోన లెహరీ లాలి పసిమువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి  జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి  సాగింది నాలో స స రి గ మ ప ద ని స రి   ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి  రాతిరొచ్చిందో రాగాలే తెచ్చిందో టిక్ టిక్ అంటాది గోడల్లో  దూరపయనంలో రైలు పరుగుల్లో చుక్ చుక్ గీతాలే చలో  సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక మధుర సంగీత సుధ పాపల్ని తానే పెంచి పాడే తల్లి లాలే హాయి మమతరాగాలు కదా  ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి  నీలారం అడుగుల్లో అల్లార్చే రెక్కల్లో ఫట్ ఫట్ సంగీతాలే విను  గోవుల్ల చిందులలో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో విను  సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక జీవన సంగీత సుధ  వర్షించే వానజల్లు వర్ణాలన్నీ గానాలేలే ధరణి చిటికేసే విను  ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి  కోయిలకే కుహూ కుహూ ఎదహోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి  నదిలోన లెహరీ లాలి పసిమువ్వల్లో సన్నాయి  గీతాలు వింటుంటేనే పుట్టే హాయి  జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి  సాగింది నాలో స స రి గ మ ప ని స రి   ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి

25, మే 2022, బుధవారం

Merupu Kalalu : Aparanji Madanude Song Lyrics (అపరంజి మదనుడే )

చిత్రం: మెరుపు కలలు(1997)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: అనురాధ శ్రీరామ్

 


అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే వినువీధిలో ఉంటె సూర్యుడే ఓడునే ఇల మీద ఒదిగినాడే కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే.. అతడేమి అందగాడే పోరాట భూమినే పూదోట కోనగా పులకింపజేసినాడే.. పులకింపజేసినాడే కళ్యారిమలనేలు కలికి ముత్యపురాయి కన్నబిడ్డతడులేవే నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే ఇరుకైన గుండెల్లో అనురాగమొలకగా నెలబాలుడొచ్చినాడే ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే.. అతడేమి అందగాడే వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే.. వచ్చె వలపంటి వాడే అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే.. అతడేమి అందగాడే వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే.. వచ్చె వలపంటి వాడే

Merupu Kalalu : O O Lalalla Song Lyrics (ఊ..లలల్లా ఉహూ.)

చిత్రం: మెరుపు కలలు(1997)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: కె.యస్.చిత్ర, ఉన్నికృష్ణన్, శ్రీనివాస్




ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా మచిలీపట్నం మామిడి చిగురులో పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పోకాల పోరి ఒకతి కోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా.. మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా తందానా తందానా తాకి మరి తందానా ఏ తాళం వాయించాడే తందానా తందానా పాట వరస తందానా ఏ రాగం పాడిస్తాడే సిరి వలపో మతిమరుపో అది హాయిలే సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే తందానా తందానా కన్నె ప్రేమ తందానా వచ్చిపోయె వసంతాలే మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా మచిలీపట్నం మామిడి చిగురులో పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి తందానా తందానా ఊసుకనుల తందానా ఊరించే తెట్టు తేవె తందానా తందానా పాటకొక తందానా చెవి నిండా గుమ్మత్తేలే వయసులలో వరసలలో తెలియందిదే మనసుపడే మౌన సుఖమే విరహానిదే తందానా తందానా మేఘరాగం తందానా వచ్చె వచ్చె వానజల్లే మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం తొలిచెలి గాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా మచిలీపట్నం మామిడి చిగురులో ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా మా చిలక మా చిలక మా చిలక... ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

30, అక్టోబర్ 2021, శనివారం

Merupu Kalalu : Vennelave Vennelave Song (వెన్నెలవే వెన్నెలవే)

చిత్రం: మెరుపు కలలు(1997)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: హరిహరన్, సాధన సర్గం



వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా… ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం  పిల్లా ఆ .. పిల్లా ఆ .  భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..  పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా  ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా.  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా  కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా  ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే  హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ  పిల్లా ఆ.. పిల్లా ఆ..  పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా  పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా  ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు . 

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…